ఒక్క తెలుగులోనే కాకుండా మొత్తం ఇండియా మొత్తం దగ్గర కూడా మోస్ట్ పాపులర్ అయ్యినటువంటి టాక్ షో లలో
నెంబర్ 1 గా నిలిచిన టాక్ షో ఏదన్నా ఉంది అంటే అది నందమూరి నటసింహ బాలకృష్ణ తో ఆహా వారు ప్లాన్ చేసిన “అన్ స్టాప్పబుల్” అనే చెప్పాలి.
మరి ఇప్పుడు రెండో సీజన్లో కి వచ్చిన ఈ సీజన్ మొదటి సీజన్ కన్నా గ్రాండ్ గా ఊహించని అతిధులతో రాణిస్తుంది.
ఇక లేటెస్ట్ గా అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ తో చేసిన ఎపిసోడ్ లు క్రేజీ గా మారగా
నెక్స్ట్ అయితే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఎపిసోడ్ కూడా పైప్ లైన్ లో ఉన్నాయి.
మరి రీసెంట్ గా చరణ్ తో ఫోన్ లో బాలయ్య మాట్లాడగా చరణ్ ఒక్క పిలుపు లో వచ్చేస్తానని తాను తెలిపాడు.
ఇక నెక్స్ట్ అయితే రామ్ చరణ్ తో ఆహా యాజమాన్యం ఓ సాలిడ్ ఎపిసోడ్ ని ప్లాన్ చేస్తుండగా మరో క్రేజీ టాక్ ఈ ఎపిసోడ్ పై తెలుస్తుంది.
బహుశా చరణ్ తో పాటుగా ప్రముఖ యంగ్ అండ్ డైనమిక్ పొలిటికల్ లీడర్ అయినటువంటి కేటీఆర్ కూడా కనిపించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.
అయితే చరణ్ కి కేటీఆర్ మంచి ఫ్రెండ్ అని చాలా మందికి తెలిసిందే.
మరి అలా కూడా ఈ ముగ్గురి సెన్సేషనల్ కాంబినేషన్ కనిపించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో అనేది తెలియాల్సి ఉంది.