ప్రస్తుతం గ్లోబల్ వైడ్ భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న టాలీవుడ్ అండ్ ఇండియా హీరోస్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకడు.
మరి మెగాపవర్ స్టార్ అయితే ఇప్పుడు RRR సక్సెస్ తో పాటుగా మరోపక్క ఇండియా టాప్ దర్శకుల్లో ఒకరైన మరో దర్శకుడు శంకర్ తో తన కెరీర్ లో 15వ సినిమాని అయితే చరణ్ చేస్తున్నాడు.
మరి ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా ఏపీ పరిసర ప్రాంతాల్లో జరుగుతూ ఉండగా గత కొన్నాళ్ల నుంచి చరణ్ అభిమానులు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం ఎదురు చూస్తూ వస్తున్నారు.
మరి ఇది అలా వాయిదా పడుతూ వస్తుండగా ఇప్పుడు ఎట్టకేలకి ఈ నిరీక్షణకు కొన్ని ట్రస్టడ్ సినీ వర్గాల నుంచి సమాచారం బయటకి వచ్చింది.
ఇక దీనితో అయితే ఈ ఫస్ట్ లుక్ ఈ ఏడాది మార్చ్ లో రామ్ చరణ్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేయనున్నారని వినికిడి. అంటే ఈ లుక్ మార్చ్ 27న రాబోతుంది అని చెప్పాలి.
ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తుండగా ఇద్దరు హీరోయిన్స్ కియారా అద్వానీ అలాగే అంజలి లు నటించగా..
శ్రీకాంత్, రవిబాబు ఇంకా చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. అలాగే ఎస్ జే సూర్య సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమాకి అయితే థమన్ సంగీతం అందిస్తున్నాడు
అలాగే నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని ఎక్కడ తగ్గకుండా నిర్మాణం వహిస్తున్నారు.