వివేకా హత్య కేసులో దోషులు వాళ్లే.. సీబీఐ చెప్పింది వాళ్లు అంగీకరిస్తారా?

 వివేకా హత్య కేసులో దోషులు దొరికారంటూ సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

 సీబీఐ కౌంటర్ లో వివేకానందరెడ్డికి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివ శంకర్ రెడ్డితో రాజకీయ వైరుధ్యం ఉందని తేలింది.

 కడప ఎంపీ టికెట్ ను వివేకానంరెడ్డి కోరుకోవడంతో ఈ హత్య జరిగిందని తెలుస్తోంది. అవినాష్ రెడ్డికి మాత్రం ఇవ్వకూడదని వివేకానందరెడ్డి కోరినట్టు సమాచారం.

 అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి శివశంకర్ రెడ్డితో కలిసి ఈ కుట్రకు పాల్పడినట్లు తెలుస్తోంది.

 అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం. సీబీఐ చెప్పిన విషయాల గురించి అవినాష్ రెడ్డి, ఇతరులు అంగీకరిస్తారో లేదో చూడాలి.

  తెలంగాణ సీబీఐ వేగంగానే ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తును పూర్తి చేసింది. అయితే అవినాష్ రెడ్డి మాత్రం ఈ కేసులో తన తప్పేం లేదని

 మీడియాలో అనవసరంగా తన గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

 అవినాష్ రెడ్డి జైలుకు పరిమితం కావాల్సి ఉంటుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

 వివేకా హత్య కేసు విషయంలో అనుమానాలే నిజమయ్యాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

 వివేకా హత్య కేసుకు సంబంధించి ఆయన కుటుంబ సభ్యులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.