బియ్యంలో పురుగులు పట్టకుండా చాలా ఫ్రెష్ గా ఉండాలంటే ఈ పద్ధతులు పాటించాల్సిందే!

 సాధారణంగా చాలామంది ఒకేసారి ఏడాది మొత్తానికి సరిపడా బియ్యం కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే ఇలా ఎక్కువ మొత్తంలో బియ్యం నిల్వ చేయడం వల్ల

 బియ్యంలో చాలా తొందరగా పురుగులు పడుతుంటాయి అయితే ఇలా పురుగు పట్టిన బియ్యం శుభ్రం చేసుకోవాలంటే ఎంతో కష్టతరం అవుతుంది.

 ఇలా పురుగు పట్టిన శుభ్రం చేయాలంటే చాలామంది కష్టపడుతూ ఉంటారు. అయితే ఇలా బియ్యంలో పురుగులు పట్టకుండా బియ్యం చాలా ఫ్రెష్ గా ఉండాలంటే

 ఈ చిన్న చిన్న పద్ధతులు పాటించి ఈ సమస్యకు పుల్ స్టాప్ పెట్టవచ్చు. సాధారణంగా బియ్యం ఎండలో ఆరబోస్తే పురుగులు పట్టవని చెబుతుంటారు

 అయితే పల్లెటూరులో ఉన్నవారు ఈ విధంగా ఎండలో వేస్తారు కానీ స్థితిలో ఉన్నవారికి ఇది కుదరదు కనుక బియ్యంలో పురుగులు పట్టకుండా ఉండాలి అంటే

  మనం వంటలలో ఉపయోగించే ఇంగువను చిన్న బట్టలు చిన్న చిన్న మూటలుగా కట్టి బియ్యం డబ్బాలో వేయాలి ఇలా ఇంగువ నుంచి వచ్చే ఘటైన వాసనకు బియ్యంలో పురుగులు అసలు పడవు.

 ఇక బియ్యంలో పురుగులను నివారించడానికి వేపాకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది వేపాకు రెబ్బలను బియ్యంలో వేయడం వల్ల పురుగులు పట్టవు.

 ఇక వేపాకు తొందరగా ఎండిపోయి బియ్యం మొత్తం ఖరాబ్ అవుతాయి కనుక చాలామంది ఎండబెట్టిన వేపాకు పొడిని చిన్న చిన్న మూటలుగా కట్టి బియ్యపు డబ్బాలో వేస్తారు

 ఇలా వేయటం వల్ల కూడా బియ్యంలోఏ విధమైనటువంటి పురుగులు పడకుండా బియ్యంలో ఉన్నటువంటి తేమను ఆరిపోయేలా చేసి బియ్యం ఎక్కువ కాలం ఫ్రెష్ గా నిల్వ ఉండేలా చేస్తుంది.