ఒకప్పుడు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు అంటే పెద్దలు పెళ్లి నిశ్చయించుకున్న తర్వాత వధూవరులు ఇద్దరు కూడా తిరిగి కళ్యాణ మండపంలోనే కలిసేవారు.
అయితే ప్రస్తుతం అలా కాదు పెళ్లి చూపుల అయిన తర్వాత అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం మొదలు పెడతారు.
ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరూ వారికి సంబంధించిన విషయాలను తెలియజేస్తూ ఉంటారు ఈ క్రమంలోనే ఒకరి గురించి మరొకరు తెలుసుకుంటారు.
అయితే ఒకసారి పెళ్లి కుదిరిన తర్వాత పొరపాటున కూడా కాబోయే వధూవరులు కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు ఆ పొరపాట్లు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం…
మద్యం సేవించకూడదు: పెళ్లి కుదిరిన తర్వాత వధూవరులు ఇద్దరిలోఎవరికి మందు తాగే అలవాటు ఉన్న పొరపాటున కూడా మందు తాగకూడదు
ఇలా మందు తాగడం వల్ల కొన్ని సార్లు మన మాట తీరు మారిపోతుంది అలాగే ఈ విషయం బయటపడటంతో పెద్ద సమస్యలు ఎదురవుతాయి.
మాజీలతో మాట్లాడకూడదు: మీరు పెళ్లికి ముందే ఇతరులతో ప్రేమలో ఉండి కొన్ని కారణాలవల్ల వారితో పెళ్లి కాకపోయి వేరొకరితో పెళ్లి కుదిరిన తర్వాత
పొరపాటున కూడా మీ మాజీ ప్రియుడు లేదా ప్రియాసితో మాట్లాడకూడదు ఇలా మాట్లాడటం వల్ల మరికొన్ని అనర్ధాలు జరిగి మీ పెళ్లి బంధం తెగిపోవడానికి అవకాశాలు ఉంటాయి.
ఆర్థిక వ్యవహారాలు:పెళ్ళికి ముందు కాబోయే వధూవరులు ఎప్పుడు కూడా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడకూడదు
ఇలా ఆర్థిక వ్యవహారాలు ప్రస్తావనకు తీసుకు వస్తే కనుక వారి జీవితం పెళ్లి వరకు అడుగులు వేరు అక్కడితోనే ఆగిపోతుంది.
ఒకరిపై ఒకరు ఫిర్యాదులు: కొందరి స్వభావం ఎలా ఉంటుంది అంటే ఇతరులతో సఖ్యతగా ఉండడానికి ఏమాత్రం ఇష్టపడరు
ఈ క్రమంలోనే ఒకరిపై ఫిర్యాదులు చేయడానికి అవకాశాలు వెతుకుతుంటారు ఇలా ఎప్పుడైతే ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటూ ఉంటారు
వారి బంధం పెళ్లి చూపుల వరకు మాత్రమే ఉంటుందని పెళ్లి వరకు వెళ్లదని చెప్పాలి అందుకే ఒకరిపై ఒకరు ఎప్పుడు కూడా ఫిర్యాదులు చేసుకోకూడదు..