ఆచార్య చాణిక్యుడు ప్రస్తావించిన చాణిక్య నీతి సూత్రాల్లో ఆనాటి సమాజంలో జరుగుతున్న ఘటనలను ఆధారంగా చేసుకుని
భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉండే నియమ నిబద్ధమైన జీవితాన్ని గడపడానికి చాణిక్య నీతి సూత్రాలు ఎంతగానో తోడ్పడతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఒక వ్యక్తి కుటుంబంలో తన భార్య పిల్లలు ముందు కొన్ని విషయాలను ప్రస్తావించకూడదట. అలాగే కొన్ని పనులను అస్సలు చేయకూడదట.
భార్య పిల్లల ముందు మాట్లాడకూడని చేయకూడని, పనులు ఏంటో చాణక్యుడు తన గ్రంథంలో చెప్పుకొచ్చాడు.
మన పిల్లల ముందు మనం ఎలా ప్రవర్తిస్తామో, ఎలా మాట్లాడతామో వారు కూడా మన ముందు అలాగే ప్రవర్తిస్తారట.
చిన్నపిల్లల మార్గ నిర్దేశకులు తల్లిదండ్రులే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లల ముందు ఎంతో హుందాతనంగా ప్రవర్తించాలి.
అలాకాకుండా పిల్లలు భార్య ముందు మీరు అసభ్య పదజాలం వాడుతూ,చేయకూడని పనులు చేస్తూ ఉంటే భవిష్యత్తులో వారు మిమ్మల్ని అనుసరిస్తారు. మీ గౌరవం తగ్గిపోతుంది.
చాణిక్య నీతి ప్రకారం మీరు మీ పిల్లల ముందు మీ భార్యను అసభ్యంగా తిట్టడం, కొట్టడం గట్టి గట్టిగా అరవడం వంటివి చేస్తే పసి హృదయాలు కలత చెంది పిల్లలలో వున్న ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది
పైగా ఇంట్లో గొడవలు పెరిగి మనస్పర్ధలు ఏర్పడతాయి. మన భారతీయ సంస్కృతిలో భార్య లక్ష్మీ స్వరూపం గా భావిస్తారు కాబట్టి లక్ష్మీదేవి కలత చెందుతుందట.
ఇంట్లో ఆడవాళ్లు బాధపడడం కలత చందనం మనకు మన ఇంటికి అంత మంచిది కాదని తెలుసుకోవాలి. మనం మన భార్య పిల్లల పట్ల ప్రేమానురాగాలని చూపిస్తే
వారు మన పట్ల గౌరవాన్ని విధేయతను కలిగి ఉంటారని చాణిక్య నీతి చెబుతోంది.