ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోంది అనడానికి ఇవే ముఖ్య సూచికలు!

 మన శరీరానికి శక్తిని అందించడంలో కొవ్వు పదార్థాల పాత్ర చాలా కీలకం. మన శరీరంలో తగినంత కొవ్వు నిల్వలు ఉంటే ఎలాంటి ప్రమాదం లేదు

 మోతాదుకు మించి ఉంటే చెడు పరిణామాలకు దారితీస్తుంది. ముఖ్యంగా రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగితే రక్త ప్రసరణ అడ్డంకులు తలెత్తి రక్తం గడ్డ కడుతుంది

 తద్వారా అధిక రక్తపోటు, గుండెపోటు సమస్యలు తలెత్తుతాయి. మరియు ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగితే ఉపకాయం సమస్య తలెత్తి చివరకు డయాబెటిస్ వ్యాధికి

 కూడా కారణం కావచ్చు.శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అధికమవుతుంది అన్న సంకేతాన్ని కొన్ని సూచనల ద్వారా ముందుగానే తెలుసుకొని తగిన జాగ్రత్త పాటిస్తే

 భవిష్యత్తులో అనారోగ్య సమస్యల నుంచి రక్షణ పొందవచ్చుఒంట్లో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం మోతాదుకు మించి పెరుగుతోంది అనడానికి మొదటి సంకేతం

 శరీర బరువులో వేగంగా మార్పు కనిపిస్తుంది. మరియు రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్పేరుకుపోయి రక్త ప్రసరణ వ్యవస్థమందగించికాళ్లవాపు,తిమ్మిర్లు,

 అలసట, నీరసం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. మరియు చేతి గోర్లు, కండ్లు ముదురు గోధుమ రంగులో కనిపిస్తాయి. మరియు గుండె దడ, నొప్పి,విపరీతంగా చెమటలు పట్టడం,

 చర్మం రంగు మారడం,చర్మంపై పసుపు దద్దుర్లు మచ్చలు వంటి లక్షణాలు దీర్ఘకాలం పాటు మీలో కనిపిస్తే లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయడం మంచిది.

 ఈ పరీక్ష ద్వారా మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ శాతాన్ని తెలుసుకోవచ్చు. తద్వారా ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గించుకునే ప్రయత్నం మొదలు పెట్టవచ్చు.

 ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ హఠాత్తుగా పెరగడానికి గల కారణాలను పరిశీలిస్తే క్రమ పద్ధతి లేని ఆహారపు అలవాట్లు,శారీరక శ్రమ లేకపోవడం,

 జన్యు సంబంధమైన కారణాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు. రోజువారి ఆహారంలో అత్యధిక కొలెస్ట్రాల్ కలిగిన ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తినడం అలవాటు చేసుకుంటే ఒంట్లో

 మోతాదుకు మించి కొవ్వు నిల్వలు పెరిగి అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. ఈ రోజుల్లో శారీరక శ్రమలోపించడం కూడా చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి ఒక కారణం

 కనుక ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక గంట సేపు వ్యాయామం, యోగ, నడక డాన్స్ వంటి అలవాటు చేసుకుంటే చెడు కొలెస్ట్రాల్ సమస్య కొంతవరకు బయటపడవచ్చు.