కంటి అలర్జీలను తగ్గించి కంటి చూపును మెరుగుపరిచే అద్భుత ఆహార పదార్థాలు ఇవే!

 ఈ రోజుల్లో కంటి సంబంధిప్రమాదకర త సమస్యలతో బాధపడే వారి సంఖ్య స్థాయిలో పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొంతకాలంగా మనల్ని హెచ్చరిస్తోంది.

 ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 285 మిలియన్లకుపైగా అంధులు ఉన్నారు.

 కాబట్టి సున్నితమైన మన కళ్ళను రక్షించుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ చూపకపోతే భవిష్యత్తులో కంటి సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 దానికి తోడు ఈ శీతాకాలం సీజన్లో వచ్చే జలుబు, దగ్గు వంటి వైరల్, బ్యాక్టీరియల్ , ఫంగల్ ఇన్ఫెక్షన్ల కారణంగా

 కంటి పైన కూడా తీవ్ర ప్రభావం చూపి కళ్ళు ఎర్రబడడం, కళ్ళు పోరివాడటం, కంటి నుంచి నీరు కారడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.

 కంటి సమస్యల నుంచి బయట పడాలంటే రోజువారి ఆహారంలో కొన్ని నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలి.

 సీజనల్గా వచ్చే కంటి సమస్యలకు చెక్ పెట్టడానికి క్రమం తప్పకుండా చేపలను ఆహారంగా తీసుకున్నట్లయితే

  వీటిలో ఉండే విటమిన్ ఏ, ఒమేగా-3 ఫాటీ ఆమ్లం పొడి బారిన కళ్ళ సమస్యను తగ్గించి రెటీనా పనితీరును మెరుగుపరుస్తుంది. క్యారెట్‌లోని విటమిన్ A పుష్కలంగా ఉంటుంది.

 ఇది దృష్టిని మెరుగు పరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి రోజు క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల చూపు మెరుగుపడుతుంది.

 రోజువారి ఆహారంలో విటమిన్ డి, విటమిన్ ఏ, విటమిన్ కే, కాల్షియం, ఐరన్ మెగ్నీషియం, మాంగనీస్ పుష్కలంగా ఉన్న ఆకుకూరలను ఆహారంలో తీసుకోవాలి

  ముఖ్యంగా పాలకూరలో ఎక్కువ మొత్తంలో ఉండే బీటా కెరోటిన్‌, కంటి ఆరోగ్యాన్ని రక్షించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది అందుకే పాలకూరను సలాడ్స్‌, కూర, పప్పు రూపంలో తినటం మంచిది.

 మొక్కజొన్నలోని ల్యుటిన్‌ వంటి పదార్థాలు కంటి ఆరోగ్యాన్ని కాపాడి మాక్యులర్‌ డీజనరేషన్‌ వంటి రెటీనా వ్యాధులను నిరోధిస్తాయి.

 మొక్కజొన్నను ఏదో ఒక రూపంలో రోజుకు 8 గ్రాములు తింటే చిన్న వయసులో శుక్లాల వచ్చే ప్రమాదం తగ్గుతోందని అనేక సర్వేల్లో వెల్లడైంది.