పుట్టగొడుగులు ఆహారంగా తీసుకుంటే ఈ వ్యాధుల ముప్పు తప్పదా…. నిపుణులు ఏమంటున్నారంటే?

 మనలో చాలామంది పుట్టగొడుగులు తినడానికి ఇష్టపడకపోగా ఏవేవో కారణాలు చెబుతుంటారు.

 పుట్టగొడుగులు తింటే శరీర బరువు పెరుగుతుందని, అలర్జీలు తలెత్తి చర్మ సమస్యలు వస్తాయని రకరకాల కారణాలు చెబుతుంటారు.

 ఇవన్నీ కేవలం అపోహ మాత్రమే ఇప్పుడు చెప్పబోయే పుట్టగొడుగుల ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే పుట్టగొడుగులను ఇష్టంగా తింటారు.

 ముఖ్యంగా పుట్టగొడుగుల్లో అత్యధికంగా లభించే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఖనిజ లవణాలు శాకాహారుల్లో పోషకాహార లోపాన్ని తొలగించడంలో కీలకపాత్ర పోషిస్తాయి

 అనడంలో ఎటువంటి సందేహం లేదు.పుట్టగొడుగులు తరచూ ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు చూద్దాం.

 ఉబకాయం, అధిక శరీర బరువు, రక్త పోటు వంటి సమస్యలతో బాధపడేవారు వారంలో ఒకటి లేదా రెండుసార్లు పుట్టగొడుగులను ఆహారంగా తీసుకుంటే

 సహజ పద్ధతిలో శరీర బరువును తగ్గించుకోవడమే కాకుండా ఉబకాయం, రక్తపోటు వంటి సమస్యలు తొలగిపోతాయి.

 మష్రూమ్స్ లో అధికంగా ఉండే పీచు పదార్థం, యాంటీ బయోటిన్ గుణాలు జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా పేగుల్లో ఉండే చెడు మలినాలను తొలగించడంలో తోడ్పడుతాయి.

 ఎముకల ,కండరాల దృఢత్వానికి సహాయపడి కీళ్ల నొప్పులు, కండరాల వాపును తగ్గిస్తుంది.అందరూ భావించినట్లుగా పుట్టగొడుగులను తింటే షుగర్ వ్యాధి రాదు.

 పుట్టగొడుగులు అత్యధికంగా ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి కావున రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించడంలో ఎంతగానో తోడ్పడతాయి.

 పుట్టగొడుగులు ఉండే యాంటీ క్యాన్సర్ గుణాలు, అమైనో ఆమ్లాల ఒంట్లో క్యాన్సర్ కణాలను నియంత్రిస్తాయి మరియు రక్తనాళాలను శుభ్రం రక్త ప్రసరణ వ్యవస్థను

 మెరుగుపరిచి గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. పచ్చకామెర్ల వ్యాధిని నియంత్రించడంలో పుట్టగొడుగులు ఎంతగానో సహాయపడతాయి.

 మరియు ఫ్యాటీ లివర్ సమస్యను కూడా తగ్గిస్తుంది. పుట్టగొడుగులు ఉండే పోషక గుణాలు మెదడు చురుకుదనాన్ని పెంపొందిస్తాయి.