టాలీవుడ్ లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఫ్యామిలీ మెగా ఫామిలీ కోసం ప్రత్యేకంగా ఆడియెన్స్ కి పరిచయం చెయ్యక్కర్లేదు.
వారి నుంచి ఉన్న స్టార్స్ గాని వారి బాక్సాఫీస్ పొటెన్షియల్ గాని వారికే సాధ్యం.
కాగా ఇపుడు మళ్ళీ వారి పెద్ద దిక్కు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వాల్తేరు వీరయ్య తో భారీ బాక్సాఫీస్ హిట్ కొట్టి మళ్ళీ సరైన ఫామ్ లోకి వచ్చారు.
ఇక తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే భారీ సినిమాలు మాత్రమే కాకుండా తన పాలిటిక్స్ లో కూడా ఫుల్ బిజీగా ఉన్నారు.
అయితే పవన్ ఇప్పుడు ఉన్న బిజీ లో కూడా ఓ ఓటిటి షో లో పాల్గొనడం జరిగింది.
కాగా పవన్ బాలయ్య షో లో పాల్గొంటే తన అన్నయ్య మెగాస్టార్ ఓ టాక్ షో లో కూడా పాల్గొన్నారు.
అయితే పవన్ పై అందులో ఓ షాకింగ్ నిజం అయితే తాను షేర్ చేశారు. పవన్ ఒకానొక సమయంలో నక్సలైట్ అయ్యిపోతాడేమో అని భయమేసింది అని చెప్పారు.
నేను ఎక్కడికైనా విదేశాలు వెళ్తే నన్ను గన్స్ తెమ్మని చెప్పేవాడని అయితే ఒరిజినల్ గాను డూప్లికేట్ వే సెమీ గా ఉండేవి అని తెలిపారు.
వాటితో తాను గడిపేవాడు అని ఓ సమయంలో అయితే తాను రైల్వే స్టేషన్ లో పట్టుబడ్డాడు అని
అది డుప్లికేట్ గన్ అని తెలిస్తే కానీ పోలీసులు అప్పుడు వదల్లేదని చిరు పవన్ కళ్యాణ్ పై షాకింగ్ ఫాక్ట్ లు షేర్ చేశారు.