ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ, వార్డ్ వాలంటీర్ల వేతనాన్ని ఏకంగా 15000 రూపాయలకు పెంచబోతున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఏపీలోని వాలంటీర్లకు ఈ స్థాయిలో వేతనం పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
అయితే జగన్ వేతనం పెంచినా ఒకేసారి వేతనం పెంచే అవకాశాలు అయితే లేవని తెలుస్తోంది.
2024 ఎన్నికల తర్వాత వాలంటీర్ల వేతనం 10000 చేయబోతున్నారని ఆ తర్వాత సంవత్సరానికి 1000 రూపాయల చొప్పున వేతనం పెంచబోతున్నారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.
అయితే గ్రామ, వార్డ్ వాలంటీర్లు మాత్రం జగన్ వేతనం పెంచితే చాలని భావిస్తున్నారని సమాచారం అందుతోంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే సచివాలయ ఉద్యోగులకు భారీ స్థాయిలో వేతనాలను పెంచిన సంగతి తెలిసిందే.
గ్రామ, వార్డ్ వాలంటీర్లకు కూడా వేతనాలను పెంచితే మాత్రం జగన్ సర్కార్ వాలంటీర్ల హృదయాలలో మంచి స్థానం సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎన్నికల్లో గెలవడానికి ఉన్న ఏ అవకాశాన్ని మిస్ చేసుకోవడం లేదని రాబోయే రోజుల్లో సీఎం జగన్ మరిన్ని భారీ వ్యూహాలను ప్రకటించనున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
గ్రామ, వార్డ్ వాలంటీర్లు ప్రస్తుతం వైసీపీ ఇస్తున్న వేతనం విషయంలో సంతృప్తితో లేరు.
గతంలో వేతనాలు పెంచాలని వాలంటీర్లు కోరినా వాళ్లకు ఇస్తున్న వేతనం గౌరవ వేతనం అని కామెంట్లు వినిపించాయి.
గతంలో వేతనాలు పెంచాలని వాలంటీర్లు కోరినా వాళ్లకు ఇస్తున్న వేతనం గౌరవ వేతనం అని కామెంట్లు వినిపించాయి.