టాలీవుడ్‌ని గిల్లుతోన్న గులాబీ పార్టీ.! బీఆర్ఎస్ ప్రచారకర్తలెవరు.?

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున తెలంగాణలో ప్రచారం కోసం పలువురు సినీ ప్రముఖులతో గులాబీ పార్టీ నేతలు మంతనాలు జరుపుతున్నారట.

2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 పార్లమెంటు ఎన్నికలు.. ఇలా రెండిటికీ కలిపి ప్యాకేజీ డీల్స్ డిజైన్ చేయబడ్డాయన్నది తాజా ఖబర్. ఓ ప్రముఖ నటి, గతంలో గులాబీ పార్టీతో సన్నిహితంగా వుండేవారు.

ఆమెకు అప్పట్లో గులాబీ పార్టీ అమితమైన ప్రాధాన్యతనిచ్చింది కూడా. అయితే, కాలక్రమంలో ఆమె గులాబీ పార్టీకి కాస్త దూరమయ్యారు. అంటే, తన కెరీర్ వ్యవహారాల్లో బిజీ అయిపోయారంతే.

ఇక, ప్రకాష్ రాజ్ అయితే.. గులాబీ పార్టీ మనిషే. భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీయార్ అంటే తెలుగు సినీ పరిశ్రమలో చాలామందికి చాలా  చాలా ఇష్టం.

మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్‌బాబు.. ఇలా ఒకరేమిటి.? దాదాపుగా అందరు సినీ ప్రముఖులతోనూ కేటీయార్ సన్నిహిత సంబంధాలు నడుపుతారు.

మొన్నామధ్యన బీజేపీ జాతీయ నాయకులు తెలంగాణకు వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీయార్ సహా పలువురు సినీ ప్రముఖులతో మంతనాలు జరిపిన సంగతి తెలిసిందే.

అయితే, మర్యాదపూర్వకంగా బీజేపీ నేతల్ని కలిసిన సినీ ప్రముఖులు, ఆ తర్వాత లైట్ తీసుకున్నారు.. సైలెంటుగా వుండిపోయారు.

తెలంగాణ నేల నుంచి ఓ ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయికి ఎదుగుతున్న దరిమిలా, తెలంగాణ సమాజం అంతా ఒక్కతాటిపై వుండాలని గులాబీ పార్టీ కోరుతోంది.

ఈ క్రమంలోనే పరిశ్రమ ప్రముఖులతోనూ బీఆర్ఎస్ నేతలు మంతనాలు జరుపుతున్నారట.

రాజకీయాల్లోకి రాకపోయినా, ఎన్నికల ప్రచారం వరకూ సినీ గ్లామర్ ఉపయోగపడేలా ఆయా సినీ ప్రముఖుల్ని ఒప్పిస్తున్నారట.