“బాలయ్య 108” పై లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే.!

 ఇప్పుడు నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకునిగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ డ్రామా “వీరసింహా రెడ్డి”.

 మరి ఈ చిత్రం బాలయ్య కెరీర్ 107వ సినిమాగా తెరకెక్కుతుండగా నెక్స్ట్ అయితే దర్శకుడు అనిల్ రావిపూడితో తన కెరీర్ 108వ సినిమాని తాను చేయనున్నారు.

 ఇక ఈ చిత్రం షూట్ పై అయితే లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు తెలుస్తుంది.

 అనిల్ రావిపూడి ఆల్రెడీ కొన్ని సీన్స్ షూట్ చేయగా ఇవి ప్రముఖ నటుడు శరత్ కుమార్ తో అయితే చేశారు.

 మరి దీనిపై ఇద్దరూ శరత్ కుమార్ మరియు అనిల్ రావిపూడి ఇద్దరు కూడా సోషల్ మీడియాలో తమ ఆసక్తి పంచుకున్న సంగతి తెలిసిందే.

 ఇప్పుడు ఈ డిసెంబర్ 28 నుంచి అయితే మూడు రోజులు పాటు మరో షెడ్యూల్ ని స్టార్ట్ చేయనున్నట్టుగా తెలుస్తుంది.

 మరి దీనిలో బాలయ్య కూడా పాల్గొననున్నారట. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా యంగ్ హీరోయిన్ శ్రీ లీల కీలక పాత్ర చేస్తుంది.

 అలాగే షైన్ స్క్రీన్ సినిమాస్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.

 ఇక వీరసింహా రెడ్డి విషయానికి వస్తే ఈ చిత్రానికి కూడా థమన్ సంగీతం అందిస్తుండగా దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలు చేశారు.

 ఇక ఈ చిత్రం వచ్చే జనవరి 12న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.