తగ్గేదే లేదంటున్న‘దిల్’ రాజు.! ఆర్థిక ప్రయోజనమా.?

 సంక్రాంతి రేసులోంచి తగ్గేదే లేదంటున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ద్విభాషా చిత్రం, డబ్బింగ్ చిత్రం కాదు..

 ‘వారిసు’ అలియాస్ ‘వారసుడు’ అనూహ్యంగా పాన్ ఇండియా సినిమా అయి కూర్చుంది.. దిల్ రాజు మాటల్లో.

 ఓ డబ్బింగ్ సినిమా కోసం, రెండు పెద్ద సినిమాల్ని.. అందునా స్ట్రెయిట్ సినిమాల్ని..

 తెలుగులో ఇద్దరు సీనియర్ హీరోల సినిమాల్ని థియేటర్ల పరంగా తొక్కెయ్యాలని దిల్ రాజు చూస్తున్న వైనం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

 ‘ఇది యాపారం.. ఇక్కడింతే..’ అని దిల్ రాజు కుండబద్దలుగొట్టేస్తున్నారు.

 అయితే, దిల్ రాజు మొండిపట్టుదల వెనుక రాజకీయ కోణాలున్నాయంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు.

 పనిగట్టుకుని ‘అజ్ఞాతవాసి’, ‘స్పైడర్’ సినిమాలతో డబ్బులు పోగొట్టుకున్నానని ఇప్పుడు తీరిగ్గా దిల్ రాజు చెప్పడమూ పలు అనుమానాలకు తావిస్తోంది.

 రెండు పెద్ద సినిమాల్ని నాశనం చేయాలనుకుంటున్న దిల్ రాజుకి, తద్వారా కలిగే ‘ప్రయోజనం’ ఏంటి.?

 ఆర్థిక ప్రయోజనమా.? రాజకీయ ప్రయోజనమా.? ఇప్పుడీ రాజకీయ అంశం ఎందుకు తెరపైకొచ్చిందబ్బా.? సమ్‌థింగ్ సస్పీషియస్ కదా.?

 తగ్గేదే లేదంటున్న‘దిల్’ రాజు.! ఆర్థిక ప్రయోజనమా.?