విశాఖ రాజధాని సరే.. మరి ఆ ప్రశ్నలకు జవాబుందా జగన్?

 ఏపీ సీఎం వైఎస్ జగన్ విశాఖను రాజధానిగా ఫిక్స్ అయ్యారు. త్వరలో తాను కూడా అక్కడికే షిప్ట్ అవుతానని ఆయన ప్రకటించారు.

 ఏపీ సీఎం వైఎస్ జగన్ విశాఖను రాజధానిగా ఫిక్స్ అయ్యారు. త్వరలో తాను కూడా అక్కడికే షిప్ట్ అవుతానని ఆయన ప్రకటించారు.

 అయితే జగన్ తాజా కామెంట్ల నేపథ్యంలో మూడు రాజధానులు ఉంటాయా? లేదా? అనే ప్రశ్నకు సరైన సమాధానం దొరకడం లేదు.

 అమరావతి, కర్నూలు ఏపీకి రాజధానులు కావని ప్రకటిస్తే ఆ వ్యతిరేకతను తట్టుకోవడం వైసీపీకి సులువు కాదు.

 వైసీపీ వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే విశాఖలో ఏం అభివృద్ధి చేసిందనే ప్రశ్నలు ఎదురవుతాయి.

 ఈ ప్రశ్నలకు సైతం జగన్ సర్కార్ నుంచి సమాధానాలు దొరకాల్సి ఉంది. మరోవైపు అసంతృప్త ఎమ్మెల్యేలను జగన్ బుజ్జగిస్తారా?

 లేక మరో విధంగా ముందుకెళతారా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. సీఎం జగన్ విశాఖను రాజధాని చేయడం వల్ల

 రాయలసీమ వాసులు తీవ్ర స్థాయిలో నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

 అమరావతే రాయలసీమ వాసులకు దూరం కాగా విశాఖ మరింత దూరంగా ఉండటం గమనార్హం.

  రాయలసీమ వాసుల ప్రశ్నల గురించి జగన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

 మరోవైపు అమరావతి రైతుల ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాల్సి ఉంది. విశాఖ విషయంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇతర ప్రాంతాల వాళ్లకు శాపంగా మారుతున్నాయి.

 జగన్ సైతం ఈ విషయాలను గమనించాల్సి ఉంది. ఈ ప్రశ్నలు జగన్ దృష్టికి వెళితే జగన్ ఏవిధంగా చేస్తారో చూడాల్సి ఉంది.