అతడు అందుకే ఫాలో అవుతున్నాడు.. మూడో పెళ్ళి పై క్లారిటీ ఇచ్చిన జయసుధ…?

 అలనాటి సీనియర్ స్టార్ హీరోయిన్ జయసుధ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 బాలనాటిగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన 50 ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు పొందింది.

 ఇక తెలుగు తమిళ్ భాషలలో ఎందరో స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్ గా కూడా మంచి గుర్తింపు పొందింది.

 హీరోయిన్ గా నటించిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిల్ అయ్యింది.

  ప్రస్తుతం తల్లి పాత్రలలో నటిస్తూ జయసుధ బిజీగా ఉంది. ఇదిలా ఉండగా తాజాగా జయసుధ మూడో పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

 60 పదుల వయసులో జయసుధ మూడో పెళ్లికి సిద్ధం అయ్యింది అంటూ వార్తలు వైరల్ అవటంతో ఇండస్ట్రీలో ఈ వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.

 కొంతకాలం క్రితం జయసుధ రెండవ భర్త ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక అప్పటి నుండి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది.

 ఇక కొంతకాలంగా జయ సుధ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక వ్యక్తిని తన వెంటబెట్టుకొని వెళుతోంది. తాజాగా వారసుడు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఆ వ్యక్తితో కలిసి కనిపించింది.

 దీంతో జయసుధ ఆ వ్యక్తిని మూడో పెళ్లి చేసుకుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ వయసులో మూడవ పెళ్లి ఏంటి అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

 తాజాగా తన మూడో పెళ్లి గురించి వస్తున్న వార్తలపై జయసుధ స్పందిస్తూ అందరికీ క్లారిటీ ఇచ్చింది. ఇటీవల మీడియా ముందుకి వచ్చిన జయసుధ ఈ విషయం గురించి మాట్లాడుతూ…

 ఆ వ్యక్తి పేరు ఫెలిపే రూయేల్స్ అని, అతను తన బయోపిక్ తీయలనుకున్నట్లు వెల్లడించింది.

 అందువల్ల తన గురించి, తన సినిమాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవటానికి ఇలా తను ఎక్కడికి వెళితే అక్కడికి ఫాలో అవుతున్నట్లు వెల్లడించింది.

  ఇంతకు మించి ఇద్దరి మద్య ఎటువంటి రిలేషన్ లేదని మూడవ పెళ్ళి గురించి అందరికీ క్లారిటీ ఇచ్చింది. ఇకనైనా ఈ పెళ్ళి వార్తలకు బ్రేక్ పడుతుందో ? లేదో? చూడాలి మరి.