ఎన్టీఆర్ జీవితంలో ఆ సంవత్సరం ఎప్పటికీ మర్చిపోలేనిది… ఎందుకంటే?

 తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి పరిచయం అవసరం లేదు

 ప్రస్తుతం ఈయన పాన్ ఇండియా హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

 అయితే ఎన్టీఆర్ కెరియర్ తీవ్ర ఇబ్బందులలో ఉన్న సమయంలో ఒకే ఏడాది ఈయన నటించిన సినిమాలు వరుసగా విడుదలై మంచి సక్సెస్ అందుకున్నాయి.

 2018 సంవత్సరంలో ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా మంచి సక్సెస్ సాధించడంతో ఈయన తదుపరి సినిమాలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

 ఇక ఇదే ఏడాదిలో తనకు రెండవ కుమారుడు భార్గవ్ రావ్ జన్మించడం జరిగింది.

 ఈ ఏడాదిలోనే ఈయనకు సంతోషకరమైన వార్తలతో పాటు ఒక చేదు జ్ఞాపకం కూడా మిగిలిపోయింది.

 అదే తన తండ్రి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడం. ఈయన తండ్రి మరణించిన తర్వాత ఈయన నటించిన అరవింద సమేత

 సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఆయన తండ్రి స్థానంలో బాలకృష్ణ హాజరు కావడం విశేషం.

 ఇలా బాలకృష్ణ ఎన్టీఆర్ సినిమా వేడుకకు హాజరు కావడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

 ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమా ఏకంగా 100 కోట్ల షేర్స్ రాబట్టడంతో అలాంటి రికార్డ్ సృష్టించిన తెలుగు సినిమాగా అరవింద సమేత నిలిచిపోయింది.

 ఈ విధంగా ఎన్టీఆర్ కి ఎన్నో తీపి జ్ఞాపకాలను చేదు జ్ఞాపకాలను మిగిల్చిన 2018 సంవత్సరాన్ని ఆయన ఎప్పుడు మర్చిపోరనే చెప్పాలి.

 ఇక ఎన్టీఆర్ గత ఏడాది త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత ఈయన కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాని ప్రకటించారు.

 అయితే ఇప్పటివరకు ఈ సినిమా పట్టాలెక్కకపోవడంతో అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.