టాలీవుడ్ ఎవర్ గ్రీన్ చార్మింగ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ రకంగా ఇప్పుడు కొత్త వెర్షన్ లోకి అడుగు పెట్టాడని చెప్పాలి.
తన తండ్రిని కోల్పోయిన తర్వాత ఆయన ఆశీర్వాదంతో మరింత రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానని
ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని అనౌన్స్ చేసి మరీ మహేష్ తన కెరీర్ పై దృష్టి పెట్టాడు.
కాగా ఇప్పుడు తన కెరీర్ లో 28వ సినిమాని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అయ్యితే భారీ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు.
సుమారు 200 కోట్ల భారీ వ్యయంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాపై మళ్ళీ పలు గాసిప్స్ గుప్పుమన్నాయి.
ఈ సినిమాకి సంగీత దర్శకుడు థమన్ ఎస్ ఇచ్చిన ఫస్ట్ ట్యూన్ ని దర్శకుడు త్రివిక్రమ్ కి అలాగే హీరో మహేష్ కి తాను వినిపించగా అది వారికి నచ్చక రిజెక్ట్ చేసారు
అంటూ ఇప్పుడు వార్తలు గట్టిగానే వైరల్ అవుతున్నాయి. దీనితో ఇవి తన దృష్టికి రాగా ఈ గాసిప్స్ పై అయితే థమన్ స్పందించాడు.
మీరు ఎన్ని ఇలాంటి చెత్త గాసిప్స్ రాసుకున్నా రాసుకోండి అంటూ వాటిని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూస్తున్నానని ఓ ఫన్నీ జిఫ్ తో తాను రిప్లై ఇచ్చాడు.
దీనితో ఈ వార్తలను తాను సింపుల్ గా కొట్టిపారేశాడు అని అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా పూజా హెగ్డే మరియు
శ్రీ లీల లు నటిస్తుండగా మరింతమంది అగ్ర నటులు ఈ చిత్రంలో కనిపించనున్నారు.