ప్రమాదకరంగా మారుతున్న తారక రత్న పరిస్థితి.!

 నిన్నటి నుంచి తెలుగు సినీ వర్గాలు మరియు రాజకీయ వర్గాల్లో కూడా ఊహించని విధంగా పరిస్థితులు మారాయి.

 ఏపీ ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం పార్టీ యువ నేత నారా లోకేష్ చేపట్టిన యువగలం అనే పాద యాత్రలో వారి కుటుంబీకుడు అలాగే

 టాలీవుడ్ ప్రముఖ నటుడు అయినటువంటి నందమూరి తారక రత్న తీవ్ర అస్వస్థత కి లోనయ్యి ఆసుపత్రి పాలయ్యాడు.

 దీనితో తన పరిస్థితి మారుతూ ఉండడంతో పార్టీ నేతలు మరియు కుటుంబీకులు తారక రత్న ని బెంగళూరు కి ఈ అర్ధ రాత్రి సమయంలో అక్కడ ప్రత్యేక గుండె  తీసుకెళ్లారు.

 అయితే ఇదిలా ఉండగా ఇప్పుడు తారక రత్న పై షాకింగ్ న్యూస్ బయటకి వచ్చింది. ముందు కన్నా ఇప్పుడు తారకరత్న ఆరోగ్యం చాలా విషమం గా మారుతుందట.

 తన బాడీ లో రక్త పోటు అధికంగా మారుతూ ఉండడంతో తీవ్రంగా బ్లడ్ బ్లీడ్ అవుతుందట దీనితో అనుకోని సమస్యలు వచ్చాయట.

 కాగా ఇప్పుడు అక్కడి వైద్యులు తన బీపీ ని నార్మల్ చేసేందుకు కష్టపడుతున్నారట. దీనితో ఈ కొత్త సమాచారం ఆందోళనకరంగా మారింది.

 ఇప్పటికే నందమూరి మరియు నారా అభిమానులు తారక రత్న కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

 అలాగే ఈరోజు సాయంత్రం తారక రత్న ని చూసేందుకు నారా చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు బయలు దేరనున్నారన్న సంగతి తెలిసిందే.