లోకేష్ కనగరాజ్.. దేశమంతా మార్మోగిపోతోంది ఈ పేరు. ‘ఖైదీ’,
‘విక్రమ్’ సినిమాలతో అనూహ్యంగా లోకేష్ కనగరాజ్ టాక్ ఆఫ్ ది ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అయిపోయాడు.
లోకేష్ కనగరాజ్‌తో సినిమాలు చేయాలని బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా.. ఎందరో హీరోలు ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
తమిళ హీరో విజయ్‌తో ‘లియో’ సినిమాని తెరకెక్కిస్తున్నాడిప్పుడు లోకేష్ కనగరాజ్.
అదే అతని ప్రత్యేకత. ‘విక్రమ్’ సినిమా చివర్లో ‘రోలెక్స్’ పాత్రలో తమిళ హీరో సూర్యని చూపించిన సంగతి తెలిసిందే.
అలా ‘లియో’లో కూడా ఓ షాకింగ్ ఎలిమెంట్ వుంటుందట.
ఆ ఎలిమెంట్ కోసం ఓ టాలీవుడ్ హీరోతో ఇప్పటికే లోకేష్ కనగరాజ్ చర్చలు జరిపి ఓకే చేసుకున్నాడట కూడా.
ఎవరా యంగ్ హీరో.? అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. తొలుత తమిళ హీరోనే ఆ పాత్ర కోసం అనుకున్నాగానీ..
ఆ తర్వాత లోకేష్ ఆలోచనలు మారాయట. టాలీవుడ్ టాప్ ఫైవ్ యంగ్ హీరోల్లో ఒకరు, ఆ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.