జనసేన పార్టీకి 2024 ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయి.? ఎంత శాతం ఓట్లను జనసేన సాధించగలుగుతుంది.? అన్న విషయమై భిన్న వాదనలున్నాయి.
జనసేన పార్టీ ఈసారి ‘జీరో’ నంబర్ చూడాల్సి వస్తుందన్నది వైసీపీ చెబుతున్నమాట. టీడీపీ కూడా ఇదే స్థాయిలో జనసేన గురించి తూలనాడుతోంది.
కానీ, జనసేన పార్టీకి టీడీపీ వలపు బాణం విసురుతూ వుంది. అసలంటూ గ్రౌండ్ లెవల్‌లో వాస్తవ పరిస్థితులు ఎలా వున్నాయి.? ఓ సర్వే తాజాగా వెల్లడించిన అంచనాల ప్రకారం,
జనసేన పార్టీ 2019 ఎన్నికలతో పోల్చితే చాలా బాగా బలపడిందని అర్థమవుతోంది. 14 శాతం ఓట్లు జనసేనకు రాబోతున్నాయట వచ్చే ఎన్నికల్లో.
సీట్ల సంఖ్య పరంగా చూసుకుంటే 5 నుంచి 15 సీట్ల వరకు జనసేన పార్టీ కైవసం చేసుకునే అవకాశం వుందన్నది ఇప్పటికే వెలుగు చూసిన చాలా సర్వేల సారాంశం.
14 నుంచి 28 శాతం వరకు జనసేన పార్టీ ఓటు బ్యాంకు పెరిగిందని ఆయా సర్వేలు తేల్చాయి. అయితే, ఇక్కడో సమస్య వుంది. జనసేన ఒంటరిగా వెళుతుందా.?
బీజేపీతో కలిసి పోటీ చేస్తుందా.? టీడీపీతో కూడా జనసేన కలుస్తుందా.? బీజేపీని వదిలేసి కేవలం టీడీపీతోనే కలుస్తుందా.? అన్నవాటిపై స్పష్టత లేదు.
‘నేనే ముఖ్యమంత్రి’ అంటున్నారు జనసేన అధినేత. దానికి చంద్రబాబు ఒప్పుకోవడంలేదాయె.!
ఈ ఈక్వేషన్‌పై స్పష్టత వస్తే తప్ప, జనసేన రాజకీయ భవిష్యత్తు ఏంటన్నది చెప్పలేం.
జనసేనలో అభ్యర్థులెవరో తెలియకుండా.. ఆయా నియోజకవర్గాల్లో జనసేన నేతల బలాబలాలేంటో తెలియకుండా..
ఈ సర్వేలెలా 14 శాతం ఓటు బ్యాంకు కట్టబెడుతున్నాయి.?అంటే, గ్రౌండ్ లెవల్లో పరిస్థితులు అలాగే వున్నాయ్ మరి.!