తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి సురేఖవాణి అందరికీ సుపరిచితమే.
ఈమె ఎన్నో సినిమాలలో తల్లి పిన్ని అక్క వదిన పాత్రలలో నటించి మెప్పించారు.
అయితే గత మూడు సంవత్సరాల క్రితం సురేఖ వాణి భర్త మరణించిన విషయం మనకు తెలిసిందే.
ఇలా భర్త మరణంతో ఈమె ఒంటరిగా మిగిలిపోయారు. తన భర్త మరణించినప్పటికీ తన కూతురి బాగోగులు చూసుకుంటూ వీరిద్దరూ సంతోషంగా గడుపుతున్నారు.
భర్త మరణం తర్వాత సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ ఈ వార్తలను సురేఖ వాణి కూతురు సుప్రీత మొదట్లో ఖండించారు.
అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈ తల్లి కూతుర్లు సురేఖవానికి రెండో పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఉందా లేదా అనే ప్రశ్న ఎదురైనప్పుడు చేసేస్తే ఒక పని అయిపోతుందంటూ సుప్రీత షాకింగ్ కామెంట్స్ చేశారు.
అయితే తాజాగా ఈమె రెండు పెళ్లి గురించి మరొకసారి వార్తలు వస్తున్నాయి.
ఇండస్ట్రీకి చెందినటువంటి ఒక స్టార్ ప్రొడ్యూసర్ ని సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
అంతేకాకుండా ఈయనకు కొడుకు వరుస అయ్యేటటువంటి వ్యక్తితో సురేఖ వాణి కుమార్తె సుప్రీత కూడా ప్రేమలో ఉందని ఇలా వీరిద్దరూ ఓకే ఇంటికి కోడల్లుగా అడుగుపెట్టబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
మరి సురేఖ వాణి సుప్రీత గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.