టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి మహేష్ బాబు కుటుంబంలో ఈ ఏడాది వరస మరణాలు చోటు చేసుకున్నాయి.
ఈ ఏడాది మొదట్లో మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మరణించారు.
ఈయన మరణించిన కొన్ని నెలలకే మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి, తండ్రి కృష్ణ వరుసగా మరణించారు.
ఇలా మహేష్ కుటుంబంలో వరుసగా మరణాలు చోటు చేసుకోవడంతో వీరి మరణానికి మహేష్ జాతకమే కారణమంటూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి జ్యోతిష్యుడు వేణు స్వామికి యాంకర్ నుంచి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.
మహేష్ కుటుంబంలో వరస మరణాలకు కారణం ఏమై ఉంటుంది అని ప్రశ్నించగా అందుకు వేణు స్వామి సమాధానం చెబుతూ మహేష్ జాతక దోషమే అందుకు కారణమని తెలిపారు.
గతంలో తాను ఎక్కువగా పద్మాలయ స్టూడియోలోనే ఉండేవాడిని విజయనిర్మల గారు ఏ చిన్న కార్యం జరిగిన తనని పిలిపించి చేయించేవారు.
అయితే ఒకరోజు వినాయక చవితి సందర్భంగా విజయనిర్మల గారు జాతకాలు చూపించారు.
ఆ సమయంలో 2020 సంవత్సరం తర్వాత మీ కుటుంబంలో వరస మరణాలు జరుగుతాయని చెప్పడంతో ఆమె తనని పిలవడం మానేశారని ఈయన తెలిపారు.
మహేష్ బాబు జాతక రీత్యా శని, గురు మారుతూ ఉన్నారని ఆ ఎఫెక్ట్ వల్ల కూడా అది తండ్రి ఆరోగ్యం మీద తల్లి ఆరోగ్యం ప్రభావం చూపుతుందని అందుకే మహేష్ కుటుంబంలో ఇలా మరణాలు చోటు చేసుకున్నాయని తెలిపారు.
మహేష్ బాబుది సింహరాశి. సింహరాశిలో పుట్టడం వల్లే ఆయన తల్లిదండ్రులు వరుసగా చనిపోయారని వేణు స్వామి తెలిపారు.