విజయం నీ జన్మ హక్కు… సమంతకు అద్భుతమైన గిఫ్ట్ పంపిన యంగ్ హీరో?

 టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత ప్రస్తుతం మయూసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే.

 ఇలా ఈ వ్యాధితో బాధపడుతున్నటువంటి సమంత పూర్తిగా నటనకు దూరమయ్యారు. అనంతరం ఈమె తన సినిమాలతో బిజీ కానున్నట్టు తెలుస్తుంది.

 ఇకపోతే సమంత ఇలాంటి వ్యాధితో బాధపడుతున్న తరుణంలో నటుడు రాహుల్ రవీందర్ ఆమెలో స్ఫూర్తిని నింపే మెసేజ్ ఉన్న ఫోటోని షేర్ చేసి తనలో ధైర్యాన్ని నింపారు.

 ఇలా హీరో రాహుల్ రవీందర్ సమంతకు షేర్ చేసిన ఈ నోట్ కనుక చూస్తే సమంతకు అక్షరాల ఈ పదాలు వర్తిస్తాయని చెప్పవచ్చు.

 ఇంతకీ రాహుల్ రవీందర్ తనకు ఎలాంటి మెసేజ్ షేర్ చేశారనే విషయానికి వస్తే.. సమంతను ఉక్కు మహిళగా అభి వర్ణిస్తూ రాహుల్ రవీందర్ పోస్ట్ చేశారు.

 ఈ పోస్టులో… ప్రస్తుతం నీ దారి చీకటిగా ఉండవచ్చు కానీ రేపు ప్రకాశిస్తుంది. ప్రస్తుతం నీ శరీరంలో కదలికలు ఉండకపోవచ్చు. కానీ రేపు బాగుంటాయి.

 ఎందుకంటే నీవు ఉక్కు మహిళవి విజయం నీ జన్మ హక్కు నువ్వు ఒక యోధురాలివి ఏవి నిన్ను ఓడించలేవు అంటూ ఈయన సమంత గురించి చెప్పుకొచ్చారు.

ఇక ఈ ఫోటోని సమంత షేర్ చేస్తూ కఠినమైన పోరాటాలు చేస్తున్న వారికి ఇది అంకితం. పోరాడుతూనే ఉండండి అప్పుడే గతంలో కంటే బలంగా తయారవుతారు. అని రిప్లై ఇచ్చారు.

 మొత్తానికి రాహుల్ రవీందర్ షేర్ చేసిన ఫోటోకి సమంత రిప్లై ఇవ్వడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అయ్యాయి.

 ఇక రాహుల్ సింగర్ చిన్మయి భర్త కావడం సమంత వీరికి మంచి స్నేహితురాలు కావడం మనకు తెలిసిన విషయం.