రష్మికను మించిపోయిన శ్రీలీల

 చాలా తక్కువ సమయంలోనే రష్మికా మండన్నా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయింది.

 కన్నడ నుంచి వచ్చి అతి తక్కువ సినిమాలతోనే స్టార్‌డమ్ దక్కించుకోవడం అంత ఆషా మాషీ కాదు. అందుకే రష్మికా మండన్నా స్పెషల్ వన్.

 ఇప్పుడు రష్మికను మించిపోయింది మరో కన్నడ కస్తూరి శ్రీలీల. ప్రస్తుతం డజనుకు పైగా ప్రాజెక్టులున్నాయ్ శ్రీలీల చేతిలో.

 మరిన్ని కొత్త ప్రాజెక్టులు సైన్ చేస్తోంది శ్రీలీల. స్టార్ హీరోలతో పాటూ, యంగ్ హీరోల సినిమాల్లోనూ శ్రీలీల అవలీలగా అవకాశాలు దక్కించేసుకుంటోంది.

 ఇప్పటికే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ సినిమాల్లో నటిస్తోంది. అలాగే, బాలయ్యతో ఓ సినిమాలో నటిస్తోంది. రష్మికను మించిపోయిన శ్రీలీల

 రామ్ పోతినేని సినిమా ఎలాగూ వుంది. వీటితో పాటూ, హీరోలందరి దృష్టి ఇప్పుడు శ్రీలీల పైనే. చూస్తుంటే, రాబోయే కాలమంతా..

 స్క్రీన్ స్పేస్ అంతా శ్రీలీలదే అనిపిస్తోంది. రష్మిక కన్నా చాలా చాలా తక్కువ టైమ్‌లోనే టాలీవుడ్‌ని అమాంతం ఆక్రమించేసింది శ్రీలీల.

 మెగాస్టార్, కింగ్.. ఇలా స్టార్ హీరో, యంగ్ హీరో అనే తేడా లేకుండా శ్రీలీలను అవకాశాలు వరించేసేలా వున్నాయంటూ టాలీవుడ్‌ ఇన్‌సైడ్ టాక్.