14 ఏళ్ల నుంచి నాతో ఉన్నందుకు థాంక్యూ మై డియర్ అంటూ ఆసక్తికర పోస్ట్ చేసిన శ్రీజ!

 శ్రీజ కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. చిరంజీవి చిన్న కుమార్తెగా అందరికీ పరిచయమైనటువంటి శ్రీజ తన వ్యక్తిగత విషయాల ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.

 ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరు భర్తలకు విడాకులు ఇచ్చినటువంటి ఈమె ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు.

 అయితే తన రెండవ భర్తకు కూడా దూరంగా ఉన్నటువంటి ఈమె విడాకుల గురించి అధికారకంగా తెలియచేయకపోయినా ఇప్పటికే వీరిద్దరికి విడాకులు పూర్తి అయ్యాయని తెలుస్తోంది.

 ఇలా తన కూతుర్లతో కలిసి వంటరిగా గడుపుతున్న శ్రీజ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు

 ఇలా సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను ఈమె అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే గత ఏడాది గురించి ఈమె పోస్ట్ చేస్తూ

 అద్భుతమైన వ్యక్తిని తనకు పరిచయం చేసే కష్టసుఖాల్లో తన వెంటే ఉండి తనని ప్రోత్సహించిన వ్యక్తితో కొత్త జీవితం ప్రారంభిస్తున్న అంటూ ఈమె చేసిన పోస్ట్ తీవ్ర దుమారం లేపింది.

 దీంతో శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతున్నారా అనే ఊహగానాలు కూడా వచ్చాయి. ఇక ఈమె ఈ పోస్ట్ గురించి మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ

 తనతో తానే రిలేషన్ లో ఉన్నానని సెల్ఫ్ రిలేషన్ కన్నా మించినది ఏదీ లేదు అంటూ ఈమె చెప్పుకొచ్చారు.

 అయితే తాజాగా ఈమె మరోసారి సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది అయితే ఈ పోస్టులో కాఫీ అంటే తనకు ఎంత ప్రేమను తెలియజేశారు.

  ఈ సందర్భంగా శ్రీజ స్పందిస్తూ తన అల్లరికి ప్రశాంతతను నువ్వే కల్పిస్తావ్.. జీవితంలో చీకటికి నువ్వే వెలుగునిస్తావు…

 ప్రతిరోజు ఉదయమే నిద్రలేస్తున్నాను అంటే నీకోసమే నా 14 ఎలా వయసులో నాకు పరిచయమై నాతోనే ఉన్నందుకు థాంక్యూ సో మచ్ మై డియర్

 అండ్ కాఫీ పై తనకున్న ప్రేమను తెలియజేస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.