గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
కాగా ఈ సినిమాలలో సెన్సేషనల్ గా ఆడియెన్స్ సహా పవన్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ఒకటి ఉంది.
ఆ సినిమానే యంగ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ ఏక్షన్ థ్రిల్లర్ చిత్రం “ఓజి”.
ది ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేయనున్న ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా
ఈ సినిమా పై అయితే ఇప్పుడు సినీ వర్గాల నుంచి సాలిడ్ అప్డేట్ తెలుస్తుంది.
ప్రస్తుతం వినోదయ సీతం రీమేక్ తో బిజీగా ఉన్న పవన్ అది కంప్లీట్ అయ్యిన వెంటనే ఏప్రిల్ నుంచే ఓజి షూట్ లో పవన్ అడుగు పెట్టనున్నాడని సినీ వర్గాలు చెప్తున్నాయి.
అంతే కాకుండా ఈ సినిమా కోసం పవన్ అయితే దాదాపు 40 నుంచి 50 రోజులు కాల్షీట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీనితో అక్కడ నుంచి నాన్ స్టాప్ గా పవన్ కంప్లీట్ చేయనున్నట్టుగా సినీ వర్గాల్లో లేటెస్ట్ గాసిప్.
మరి ఇలా మొత్తానికి అయితే ఈ సినిమాతో పవన్ ఫాన్స్ కి కావాల్సిన అసలైన ట్రీట్ ఇవ్వనున్నాడని చెప్పాలి.
ఇక ఈ సినిమాలో ఎలాంటి హీరోయిన్ ఉండదని టాక్ కాగా ఈ సినిమా ఓ సూపర్ గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కనుంది. అలాగే పాటలు కూడా ఉండవ్ అంటున్నారు.
ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఆర్ ఆర్ ఆర్ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.