ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర మంచి క్రేజీ గా ఉన్న సెన్సేషనల్ కొలాబరేషన్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు
తన మాస్ చరిష్మా కి తగ్గ మరో సూపర్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ కూడా అని చెప్పాలి.
మరి ఈ బిగ్గెస్ట్ కాంబినేషన్ లో ఎన్టీఆర్ కెరీర్ లో 31వ సినిమా ఆల్రెడీ అనౌన్స్ కాగా దీనిపై ఎనలేని హైప్ సెట్టయ్యింది.
అయితే ఈ సినిమా ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వాలి అంటే దీని ముందు దర్శకుడు కొరటాల శివతో తారక్ మరో భారీ సినిమా కంప్లీట్ చేయాల్సి ఉంది.
కాగా ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో సినిమాపై అప్డేట్ ఏమిటంటే మొదటగా ఎన్టీఆర్ కొరటాల సినిమా పూర్తయ్యే సమయానికి నీల్ సినిమాని ఈ ఏడాది లోనే స్టార్ట్ చేసేయనున్నాడట.
మరి ఇండస్ట్రీ వర్గాల్లో లేటెస్ట్ సమాచారం అయితే ఈ బిగ్గెస్ట్ కాంబో ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ చిత్రం పనులు స్టార్ట్ కానున్నాయట.
అప్పటికి ప్రశాంత్ నీల్ కూడా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ కంప్లీట్ చేసి రిలీజ్ కూడా చేసేస్తాడు సో ఎలాంటి గ్యాప్ లేకుండా
ఈ సినిమా కూడా వీరు షురూ చేసేయనున్నారని సినీ వర్గాల్లో లేటెస్ట్ సమాచారం.
ఇప్పటికే ఈ సినిమాకి అదిరిపోయే కాన్సెప్ట్ ని ప్రశాంత్ నీల్ తీసుకున్నారని రూమర్స్ ఉన్నాయ్
వాటికి తగ్గట్టే ఎలాంటి డౌన్ లేకుండా సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని ఇన్సైడ్ టాక్.