నేచురల్ స్టార్ నాని కోసం తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదు.
మరి నాని అయితే ఇప్పటివరకు 28 సినిమాలు చేయగా వాటిలో 29వ సినిమా “దసరా” అయితే సెట్స్ మీద ఉంది.
ఇక ఏ హీరో కెరీర్ లో అయినా కూడా ఓ హీరో కొన్ని బెంచ్ మార్క్ సినిమాలు ఉంటాయి.
అలా నాని కెరీర్ లో “వి” సినిమా 25వ సినిమా కాగా దీని తర్వాత అప్పుడే తాను 30వ సినిమాకి వచ్చాడు. అందుకే ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు ప్రతిష్టాత్మకంగా మారాయి.
ఇక నిన్న ఈ ప్రాజెక్ట్ పై ఓ కొత్త నిర్మాణ సంస్థతో అప్డేట్ రాగా ఈ జనవరి 1 తో అయితే కంప్లీట్ అనౌన్సమెంట్ రానున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.
ఇక ఇప్పుడు ఈ సినిమాలో అయితే హీరోయిన్ గా ఎవరు దిగనున్నారో ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి సమాచారం.
మరి దీని ప్రకారం అయితే ఈ ఏడాది సీతారామం తో తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయ్యి ఫస్ట్ సినిమాతోనే మెప్పించిన బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అట.
ఈమె నాని సరసన ఇది వరకే నటించాల్సి ఉంది కానీ ఇప్పుడు ఈ సినిమాథి అయితే ఫైనల్ అయ్యింది.
ఇక అలాగే ఈ సినిమాకి గాను కొత్త డైరెక్టర్ పరిచయం అవుతున్నాడు. రేపు అయితే ఈ సినిమాపై మరిన్ని డీటెయిల్స్ బయటికి రానున్నాయి.