భారీగా రెమ్యునరేషన్ పెంచిన శ్రీ లీల.?

 ఇప్పుడు టాలీవుడ్ లో ఓ రేంజ్ లో షైన్ అవుతున్న యంగ్ హీరోయిన్స్ లో శ్రీ లీల కూడా ఒకరు.

 ఇప్పుడు ఈమె పేరు నెక్స్ట్ లెవెల్లో తెలుగు సినిమా వర్గాల్లో మంచి హాట్ టాపిక్ గా మారగా ఇప్పుడు ఈ హీరోయిన్ పై కొన్ని గాసిప్స్ మరింత స్థాయిలో గట్టిగా వినిపిస్తున్నాయి.

 ఇప్పుడు అయితే శ్రీ లీల చిన్న సినిమా తోనే స్టార్ట్ కాగా ధమాకా తో పెద్ద ఆఫర్ అందుకుంది.

 మరి ఈ రెండు సినిమాలకి కూడా ఈ యంగ్ బ్యూటీ తక్కువ రెమ్యునరేషన్ నే ఛార్జ్ చేసినా

 ఇప్పుడు మాత్రం ధమాకా సెన్సేషనల్ హిట్ తో ఈమె కూడా రెమ్యునరేషన్ భారీ గా పెంచినట్టుగా ఇప్పుడు ఇన్సైడ్ టాక్.

 మరి గత సినిమాలకి 50 లక్షల లోపే ఈ యంగ్ హీరోయిన్ రెమ్యునరేషన్ గా ఛార్జ్ చేయగా ఇప్పుడు సగానికి పైగా పెంచేసినట్టుగా తెలుస్తుంది.

 అంటే ఈ సినిమా తర్వాత నుంచి ఆమె ఓ సినిమా ఓకే చేస్తే మినిమమ్ 1 కోటి ఛార్జ్ చేయనున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది.

 దీనితో ఈ టాక్ ఇప్పుడు సినీ వర్గాల్లో టాపిక్ గా మారింది. మరి దీనిలో ఎంతవరకు నిజమో లేదో అనేది చూడాలి.

 ఇక ఈ యంగ్ బ్యూటీ తెలుగు సహా కన్నడ లో పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది.

 అలాగే తెలుగులో అయితే మరిన్ని చిత్రాలు ఈమె ఓకే చేస్తున్నట్టుగా భోగట్టా.