మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే ఈయన తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.
ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా నటించిన విషయం మనకు తెలిసిందే.
ఈ సినిమాలో రవితేజ కమిషనర్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే ఈ సినిమాలో రవితేజ స్థానంలో ముందుగా మరొక మెగా హీరో నటించాలని ఆయనకే అవకాశం కల్పించాలని డైరెక్టర్ బాబి అనుకున్నారట.
అయితే రవితేజ స్థానంలో నటించాల్సిన ఆ మెగా హీరో ఎవరు అనే విషయానికి వస్తే మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రవితేజ పాత్రలో నటించాలని అనుకున్నారట.
వరుణ్ తేజ్ ఈ సినిమాలో నటించడానికి చిరంజీవి నో చెప్పడం వల్లే ఆ పాత్రలో నటించే అవకాశం రవితేజకు వచ్చిందని చెప్పాలి.
ఓకే ఫ్యామిలీ నుంచి ఓకే సినిమాలో ఇద్దరు హీరోలు కనపడితే ప్రేక్షకులు దానిని యాక్సెప్ట్ చేయలేరని ఇప్పటికే ఆచార్య సినిమా ఈ విషయాన్ని రుజువు చేయడమే
కాకుండా ఇదొక బ్యాడ్ సెంటిమెంటుగా మారడం వల్లే చిరంజీవి ఈ పాత్రలో వరుణ్ తేజ్ ను వద్దని చెప్పారట.
ఈ బాడ్ సెంటిమెంట్ కారణంగానే తన పెదనాన్న సినిమాలో నటించే అవకాశాన్ని వరుణ్ తేజ్ కోల్పోయారని ఆ అవకాశం రవితేజకు వచ్చిందని చెప్పాలి.
ఇక చిరంజీవి రవితేజ ఇదివరకే అన్నయ్య సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇక ఈ సినిమా కూడా పక్క బ్లాక్ బస్టర్ అవుతుందన్న ధీమాలో మెగా అభిమానులు ఉన్నారు.