ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో భారీ క్రేజ్ ఉన్న లేటెస్ట్ చిత్రాల్లో మన సౌత్ నుంచే చాలా సినిమాలు ఉండగా వాటిలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు దర్శకుడు శంకర్ ల కాంబినేషన్ లో వస్తున్న RC 15 అనే సినిమా కూడా ఒకటి.
మరి ఈ చిత్రం అయితే శంకర్ నుంచి ఓ కొత్త సబ్జెక్టు గా వస్తుండగా అభిమానుల్లో చాలా అంచనాలు దీనిపై ఉన్నాయి.
ఇక శంకర్ సినిమా అంటే నటుల్ని తాను ఎలా చెక్కుతాడో తెలిసిందే.
అలాగే ఈ సినిమాలో కూడా చరణ్ చాలా కొత్త గెటప్స్ లో వేరియేషన్స్ లో కనిపిస్తున్నాడు.
అలాగే ఈ సినిమాలో చరణ్ తండ్రి కొడుకుగా కనిపిస్తాడని తెలిసిందే.
అయితే తండ్రి రోల్ ఫ్లాష్ బ్యాక్ లో ఉండగా ఇప్పుడు ఇందులో ఓ క్రేజీ ఎపిసోడ్ పై కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యి షాకింగ్ గా మారాయి.
అయితే ఇందులో శంకర్ రామ్ చరణ్ తో అదిరే సీన్ ని చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఇప్పుడు చరణ్ పై కొన్ని పొలిటికల్ సీన్స్ ని చేస్తున్నారట. మరి ఎపిసోడ్స్ అన్నీ కూడా థియేటర్స్ లో అదిరిపోయే లెవెల్లో ఉంటాయని తెలుస్తుంది.
ఇంకా ఈ సినిమాలో చరణ్ సరసన మరోసారి కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా
థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం వహిస్తున్నారు.