ప్రస్తుతం సంక్రాంతి కానుకగా టాలీవుడ్ లో రిలీజ్ కి రాబోతున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రాలలో నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా
దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కించిన చిత్రం “వీరసింహా రెడ్డి” కూడా ఒకటి.
మరి ఈ సినిమాలో సంగీత దర్శకుడు థమన్ ఇచ్చిన ప్రతి సాంగ్ కూడా ఒకదాన్ని మించి ఒకటి సూపర్ హిట్ కాగా వాటిలో ఐటెం నెంబర్ మా బావ మనోభావాలు కూడా ఒకటి.
మరి ఈ సాంగ్ కి అయితే లేటెస్ట్ గా టాలీవుడ్ సీనియర్ నటి మరియు వెటరన్ ఐటెం బ్యూటీ జయమాలిని మాస్ ఎనర్జీ తో స్టెప్పులు వేయడం వైరల్ గా మారింది.
మరి ఆమె ఈ ఏజ్ లో కూడా ఇంత ఎనర్జీ తో తాను బాలయ్య సాంగ్ కి పెర్ఫామ్ చేయడంతో నెటిజన్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మరి ఇప్పుడంటే ఐటెం సాంగ్స్ కి మన వాళ్ళు ఏవేవో ప్లాన్స్ చేస్తున్నారు కానీ ఒకప్పుడు ఐటెం సాంగ్స్ కి అంటే టాలీవుడ్ లో మొదటగా గుర్తొచ్చేది సిల్క్ స్మిత, జయమాలిని పేర్లే అని చెప్పడంలో సందేహం లేదు.
అందుకే ఇప్పుడు ఈ వీడియో మంచి వైరల్ అయ్యింది.
ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా జనవరి 12న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.