టాలీవుడ్‌లో సంక్రాంతి రద్దీ.! అప్పుడే కొట్టుకుంటున్నారు.!

 సంక్రాంతి మొన్ననే కదా వెళ్ళింది.? మళ్ళీ సంక్రాంతి రద్దీ ఏంటబ్బా.? అంటే, ఇది వచ్చే ఏడాది సంక్రాంతి వ్యవహారం.!

 వచ్చే సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలకు సంబంధించి ‘స్లాట్స్’ ఆల్రెడీ రిజర్వ్ అయిపోతున్నాయి.

 రిజర్వ్ చేస్తున్నారు సరే.. మాట ప్రకారం సినిమాల్ని తీసుకొస్తారా.? అన్నదే పెద్ద డౌటు.! మహేష్ – త్రివిక్రమ్ సినిమా సంక్రాంతికే రావొచ్చు.

 మెగాస్టార్ చిరంజీవి సినిమా కూడా ఖచ్చితంగా సంక్రాంతికి వుంటుంది.. అదింకా ప్రారంభం కాలేదు.

 కానీ, మెగాస్టార్ కోసం డేట్ లాక్ చేసే ప్రయత్నాల్ని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ చేస్తోందిట.

 యంగ్ టైగర్ ఎన్టీయార్ సినిమా కూడా సంక్రాంతికే రావొచ్చంటున్నారు. ప్రభాస్ ఈ సంక్రాంతిని మిస్సయ్యాడుగానీ, వచ్చే సంక్రాంతి మాత్రం మిస్ అవడట.

 అల్లు అర్జున్ కూడా ‘పుష్ప ది రూల్’ని సంక్రాంతికే తేవాలనుకుంటున్నాడట.

 ఇలా ఓ అరడజను వరకు సినిమాలు అగ్ర హీరోల నుంచే వచ్చే సంక్రాంతికి వుంటాయని తెలుస్తోంది.

 ఆ లిస్టులో పవన్ కళ్యాణ్ సినిమా ‘ఓజీ’ లేదా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వుండొచ్చు.

 టాలీవుడ్‌లో ఇంతకు ముందెన్నడూ లేని ఇలాంటి పోటీ గురించి ఇప్పుడంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

 అన్నట్టు బాలయ్య – అనిల్ రావిపూడి సినిమా కూడా సంక్రాంతికేనా.?