టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా భయంకరమైనటువంటి మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి మనకు తెలిసిందే.
ఇలాంటి వింత వ్యాధితో బాధపడుతున్నటువంటి సమంత పూర్తిగా తన సినిమాలకు విరామం ప్రకటించి మెరుగైన చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
ఈ వ్యాధి నుంచి సమంత త్వరగా కోలుకోవాలని ఎంతోమంది సినీ సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా ఆకాంక్షించారు.
ఇక ఈమెకు అనారోగ్య సమస్యలు అధికమవడంతో సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వనున్నట్టు సమాచారం.సమంత చివరిగా నటించిన చిత్రం యశోద.
ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా సమంత పూర్తి చేసి విడుదల చేశారు.ఈ సినిమా థియేటర్లో ఎంతో అద్భుతమైన విజయాన్ని కూడా అందుకుంది.
ఈ సినిమా తర్వాత సమంత ఇతర సినిమాలలో నటించాల్సి ఉండగా అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు విరామం ప్రకటించారు.
ఇకపోతే ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈమెకు వరుసగా బాలీవుడ్ అవకాశాలు వచ్చాయి.
అయితే తన అనారోగ్య సమస్య కారణంగా ఈ బాలీవుడ్ ప్రాజెక్టులు అన్నీ కూడా వదులుకున్నట్టు సమాచారం.
ఇకపోతే శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఈ సినిమా అనుకున్న విధంగా షూటింగ్ పనులు జరుపుకొని ఉంటే ఈ ఏడాది డిసెంబర్ నెలలోనే విడుదల అయ్యేది.
సమంత అనారోగ్య సమస్య కారణంగా ఈ సినిమా షూటింగ్ కూడా వాయిదా పడింది అయితే ఈ సినిమా దాదాపు 60% షూటింగ్ పూర్తి కావడంతో సమంత కొంత విరామం తర్వాత ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయనున్నారట.
ఈ సినిమా అనంతరం సమంత సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.