మొత్తానికి సమంత రెడీ..ఈ డేట్ నుంచి.!

 సౌత్ ఇండియా సినిమా దగ్గర భారీ స్టార్డమే ఉన్న హీరోయిన్స్ లో సమంత ప్రభు కూడా ఒకరు. ఇప్పుడు హీరోయిన్ గా తక్కువ తానే మెయిన్ లీడ్ లో ఎక్కువ సినిమాలు చేస్తున్న తాను

 లేటెస్ట్ గా సినిమాలతో పాటుగా పలు వెబ్ సిరీస్ లు పాన్ ఇండియా నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు కూడా చేస్తుంది.

 ఇలా అయితే సమంత ఫుల్ బిజీగా ఉండగా ఆమె పర్సనల్ గా కూడా అనారోగ్యంతో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

 మరి ఫైనల్ గా అయితే సమంత తన హెల్త్ ని కుదుట పరుచుకొని సినిమాల కోసం రెడీ అయినట్టుగా తెలుస్తుంది.

 ఓ పక్క భారీ పాన్ ఇండియా సినిమా శాకుంతలం ని కంప్లీట్ చేసిన సామ్ నెక్స్ట్

 అయ్యితే సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తో “ఖుషి” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

 ఇందులో ఆమె హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈ మధ్యనే ఆమె వల్ల షూటింగ్ లేట్ అవుతుందని విజయ్ ఫ్యాన్స్  కి కూడా సమంత క్షమాపణ చెప్పింది.

 అయితే సమంత ఈ సినిమా కోసం ఫైనల్ గా డేట్స్ ఇచ్చినట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమా కోసం సమంత ఈ మార్చ్ 8 నుంచి రెడీ కాబోతుందట.

 ఆరోజు సినిమా షూటింగ్ ఇద్దరిపై స్టార్ట్ కానుండగా అక్కడ నుంచి కొన్ని రోజులు పాటుగా ఈ షూటింగ్ జరగనుందట.

 కాగా ఈ సినిమాని అయితే దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తుండగా సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.