నాగచైతన్య చేసిన పనికి ఫుల్ ఖుషీ అవుతున్న సమంత !

 అక్కినేని నాగచైతన్య సమంత ఒకరికొకరు ప్రేమించుకొని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వివాహం తర్వాత ఈ ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలిచారు.

 టాలీవుడ్ ఇండస్ట్రీలోనే బెస్ట్ కపుల్ గా గుర్తింపు పొందారు. ఇలా కొంతకాలం సంతోషంగా సాగిపోయిన వీరి జీవితం ఒక్కసారిగా తలకిందులు అయింది.

 ఇద్దరి మధ్య మనస్పర్టలు రావడంతో ఒకరికొకరు చర్చించుకుని మనస్ఫూర్తిగా విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ఇద్దరు ప్రకటించారు.

  అయితే అందరికీ ఆదర్శంగా నిలిచిన ఈ జంట ఇలా విడిపోవడంతో వీరి అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

 వీరిద్దరూ మళ్లీ కలవాలని అభిమానులు ఇప్పటికీ ఆశ పడుతూనే ఉన్నారు. సమంత నాగచైతన్య కలిసే అవకాశం లేదని ఇప్పటికే సమంత స్పష్టంగా తెలియజేసింది.

 ప్రస్తుతం సమంత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడైనా నాగచైతన్య విడాకులు రద్దు చేసుకుని సమంత తో కలిసిపోతాడని అందరూ భావించారు.

 నాగచైతన్య మాత్రం తన పంతం మీదే ఉన్నాడు.. ఇలా ఉండగా సమంత నాగచైతన్య గురించి ఇటీవల ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 నాగచైతన్య నుండి విడిపోయిన సమంత ప్రస్తుతం నాగచైతన్య చేసిన పనికి ఫుల్ ఖుషి లో ఉన్నట్లు తెలుస్తోంది.

 అయితే ఇలా వీరు అనూహ్యంగా విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత మళ్లీ కలిసి నటించే అవకాశం లేదు. ఇప్పటివరకు వీరిద్దరూ ఆ సినిమా కోసమైనా కలుస్తారు అని అందరూ భావించారు.

  అయితే ఇటీవల నాగచైతన్య సినిమాకు చేసుకున్న అగ్రిమెంట్ ని అఫీషియల్ గా రద్దుచేసి ఆ అగ్రిమెంట్ కాగితాలను చింపేసినట్లు తెలుస్తోంది.

 దీంతో నాగచైతన్యతో మళ్లీ కలిసి నటించడం ఇష్టం లేని సమంత నాగచైతన్య ఇలా చేయడంతో ఆనందపడుతున్నట్లు సమాచారం.