సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే.
ఈ వ్యాధితో బాధపడుతూనే ఈమె కమిట్ అయిన సినిమాలకు డబ్బింగ్ పనులను పూర్తి చేశారు. అలాగే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు.
గతంలో యశోద సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత ఏకధాటిగా కన్నీళ్లు పెట్టుకున్న విషయం మనకు తెలిసిందే.
అయితే ఈ వీడియో చూసిన అభిమానుల మనసు కూడా తరుక్కుపోయింది. ఇక తాజాగా సమంత నటించిన శాకుంతలం సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా సమంత పాల్గొని వేదికపై కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇలా సమంత మరోసారి ఏడవడంతో ఎంతోమంది అభిమానులు ఆమెకు ధైర్యం చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వీడియో పై నిర్మాత చిట్టి బాబు స్పందించి సమంత పట్ల విమర్శలు చేశారు.
సమంత వేదికపై ఏడవడం చాలా ఓవరాక్షన్ గా ఉందని ఆయన తెలిపారు. సమంత లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించారు.
అయితే లేడీ ఓరియంటెడ్ సినిమా అంటే ప్రతి ఒక్క సన్నీ వేషాలలో నటించాల్సి ఉంటుంది.
ఇదివరకే ఎంతోమంది హీరోయిన్స్ లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించారు. అయితే వాళ్ళు ఎవరు కూడా ఎప్పుడు వేదికపై కన్నీళ్లు పెట్టుకోలేదు.
సమంత మాత్రమే ఇలా ఓవర్ ఎగ్జైట్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటుందని, ఇక ఆమె బాధపడుతున్న మయోసైటిస్ వ్యాధి కూడా పెద్దగా ప్రాణాంతకరమైనది కాదు
ఆమె తరచూ నేను బ్రతుకుతానో చస్తాను అంటూ బాధపడటం కరెక్ట్ కాదని ఆమెను ఎవరు గైడ్ చేస్తున్నారో తెలియదు కానీ
తనపై మరింత ఒత్తిడి తీసుకువస్తూ తనని భయాందోళనకు గురి చేస్తున్నారనీ నిర్మాత చిట్టిబాబు సమంత గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి