వారి అతి పోస్ట్ కి చెంప పగిలే రిప్లై ఇచ్చిన సమంత.!

సౌత్ ఇండియా ఇప్పుడు టాప్ హీరోయిన్స్ లో సమంత క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది.

మరి అది తన లాస్ట్ సూపర్ హిట్ చిత్రం “యశోద” తోనే ప్రూవ్ కాగా సమంత మళ్ళీ మరో భారీ పాన్ ఇండియా సినిమాతో అయితే ముందుకొస్తుంది.

ఆ సినిమానే “శాకుంతలం” కాగా ఈ చిత్రం నుంచి నిన్నే చిత్ర బృందం భారీ విజువల్స్ తో కూడిన ట్రైలర్ ని అయితే రిలీజ్ చేసారు.

అయితే ఈ ట్రైలర్ లాంచ్ లో సమంత కూడా హాజరు కాగా చాలా సందర్భాల్లో తాను ఇంకా తన మాయోసైటిస్ తో అయితే బాధపడుతున్నట్టుగా తన ఒంట్లో పోరాడుతూనే కనిపించింది.

దీనిపై కొన్ని వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.అయితే ఆమెపై సోషల్ మీడియాలో ఓ ప్రముఖ హ్యాండిల్ వాళ్ళే ఎప్పుడూ ఎవరొకరిని ట్రిగ్గర్ చేస్తూ ఎంతసేపు నెగిటివ్ మీద ఆధారపడే వాళ్ళే

సమంత అంత ఇబ్బంది పడుతూ ఉంటే అందులో కూడా సమంత తన గ్లామర్ ని కోల్పోయింది అంటూ పోస్ట్ చేశారు.

దీనితో వారి అతికి సమంత చెంప పగిలే రిప్లై ఇవ్వడం సోషల్ మీడియా సహా నేషనల్ మీడియాలో కూడా మంచి వైరల్ గా మారింది.

తనపై మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా పెట్టిన పోస్ట్ పై తాను స్పందిస్తూ “నేను కూడా నీ కోసం ప్రార్థిస్తున్నాను, నాలా నెలల తరబడి ట్రీట్మెంట్ లాంటివి నువ్వు తీసుకోకూడదు.

నేను పడ్డ బాధ నీకు రాకుండా ఉండాలి నా లవ్ తీసుకొని నువ్వు గ్లో అవ్వు” అంటూ రిప్లై ఇచ్చింది.

దీనితో సమంత ఇచ్చిన సమాధానం పర్ఫెక్ట్ అంటూ సోషల్ మీడియా సహా నేషనల్ మీడియా వారు సమంతని అభినందిస్తున్నారు.