బాలీవుడ్ రామాయణంలో సీతగా సాయి పల్లవి… రెమ్యునరేషన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

తెలుగు చిత్ర పరిశ్రమలో లేడీ పవర్ స్టార్ గా, నేచురల్ బ్యూటీగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సాయి పల్లవి నటించిన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇలా నటన ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేసుకొని వరుస హిట్ సినిమాలతో తెలుగు తమిళ భాషలలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సాయి పల్లవి

గత కొద్ది కాలంగా ఎలాంటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో ఈమె సినిమాలకు గుడ్ బై చెప్పి తన వైద్య వృత్తిలో స్థిరపడబోతుందని వార్తలు వస్తున్నాయి.

ఇకపోతే తాజాగా సాయి పల్లవి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాయి పల్లవి బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతుందని తెలుస్తోంది.

బాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు నితీష్‌ తివారీ ఇటీవల రామాయణం కథను సరికొత్త కోణంలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇందలో రాముడిగా రణ్​బీర్​ కపూర్‌, రావణుడిగా హృతిక్‌ రోషన్ నటించబోతున్నారు

ఇక ఈ సినిమాని మధు మంతెన, నమిత్ మల్హోత్ర, అల్లు అరవింద్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు.

ఇక ఈ సినిమాలో సీత పాత్రలో ముందుగా కరీనాకపూర్ ను ఎన్నుకున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో సాయి పల్లవి నటించబోతుందని వార్తలు వస్తున్నాయి

ఇలా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సాయి పల్లవి అయితే సీత పాత్రలో అద్భుతంగా ఉంటుందని భావించిన మేకర్స్ ఈమెను ఎంపిక చేసినట్లు సమాచారం.

ఇక దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఈమె ఒక్కో సినిమాకు దాదాపు రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేది అయితే

బాలీవుడ్ రామాయణంలో నటించడం కోసం ఏకంగా 4.5 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినప్పటికీ మేకర్స్ అంత ఇవ్వడానికి సై అనడంతో బాలీవుడ్లోకి ఈమె ఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తుంది. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.