పాపం పూజ హెగ్డే…. మరోసారి తప్పని ఐరన్ లెగ్ ట్రోలింగ్స్!

 పూజా హెగ్డే కెరియర్ మొదట్లో పలు సినిమాలలో నటించినప్పటికీ ఈమెకు పెద్దగా సినిమాలో సక్సెస్ కాకపోవడంతో ఇండస్ట్రీకి ఈమె ఐరన్ లెగ్ అంటూ చాలామంది తనని నెగిటివ్ కామెంట్లు చేస్తూ ట్రోల్ చేశారు.

 ఇలా కెరియర్ మొదట్లో పూజ హెగ్డే నటించిన పలు సినిమాలు ఫ్లాప్ కావడంతో చాలామంది ఈమెను ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేశారు.

 అయితే ఇలాంటి ట్రోలింగ్స్ నుంచి ఈమెను త్రివిక్రమ్ శ్రీనివాస్ బయట పడేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం అరవింద సమేత.

 ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పూజ హెగ్డే అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకుంది.

 ఈ సినిమా తర్వాత మహర్షి, అలా వైకుంఠపురంలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర వంటి వరస బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ హిట్ సినిమాలలో నటించారు.

 ఇలా వరుస హిట్ సినిమాలు కావడంతో ఈమెకు పలు భాషలలో అవకాశాలు వచ్చాయి. దీంతో ఈమె పై ఉన్నటువంటి ఐరన్ లెగ్ అనే ముద్ర తొలగిపోయింది.

 ఇక ఏడాది పూజా హెగ్డేకు చాలా బాడ్ ఇయర్ అని చెప్పాలి.ఏడాది ఈమె భారీ బడ్జెట్ సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు.

 అయితే ఇందులో ఏ ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. ప్రభాస్ సరసన పాన్ ఇండియా స్థాయిలో రాధేశ్యామ్ సినిమాలో నటించారు. ఇది డిజాస్టర్ అయింది.

 ఈ సినిమా తర్వాత ఆచార్య బీస్ట్ వంటి సినిమాలలో నటించిన ఇది కూడా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇలా ఈమెకు వరుస ఫ్లాప్ సినిమాలు వచ్చినప్పటికీ మరోసారి అవకాశాలు వచ్చాయి.

 అయితే పూరీ జగన్నాథ దర్శకత్వంలో వచ్చినటువంటి జనగణమన సినిమా ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది.

  ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా కూడా మరి కాస్త ఆలస్యం అవుతూ రావడంతో మరోసారి ఈమెను ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

 చూడాలి మరి త్రివిక్రమ్ సినిమాతో మరోసారి ఈమె ఫేక్ మారుతుందా లేక ఇదే బిరుదును కంటిన్యూ చేస్తుందో వేచి చూడాలి.