మహాశివరాత్రి రోజున శివలింగానికి బిల్వపత్రం సమర్పించేటప్పుడు పాటించవలసిన నియమాలు..?

 మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రజలందరూ ఎంతో భక్తశ్రద్ధలతో జరుపుకుంటారు.

 మహాశివరాత్రి రోజున శివ లింగాలికి అభిషేకాలు, పూజలు చేయటం వల్ల పుణ్య ఫలం దక్కుతుంది.

 అందువల్ల శివరాత్రి రోజున తెల్లవారు జాము నుండి ఉపవాస దీక్షలు చేసి , రాత్రి జాగరణ చేసి నిత్యా ఓం నమః శివాయ అని శివనామ స్మరణ చేస్తూ

 శివున్ని ఆరాధించటం వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుంది. అయితే శివరాత్రి రోజున శివుడిని పోజించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పుకుండా పాటించాలి.

 పూజ విధానంలో తెలియక చేసిన పొరపాటు వల్ల ఆ పూజ చేసిన ప్రతిఫలం దక్కదు. అందువల్ల శివ లింగాన్ని పూజించే సమయంలో

 శివరాత్రి రోజున శివలింగానికి పూజ చేసే సమయంలో బిల్వపత్రాలు సమర్పించాలి. అయితే మనం శివలింగానికి సమర్పించే బిల్వ మీద ఎటువంటి మరకలు లేకుండా ఉండాలి.

 అలాగే కత్తిరించిన మరియు ఎండిపోయిన బిల్వపత్రాలను శివలింగానికి సమర్పించకూడదు.

 ఇక శివలింగం పై బిల్వపత్రం సమర్పించే ముందుదానినిశుభ్రంగాకడిగిఆకులోనిమృదువైనభాగంవైపుశివలింగంమీదసమర్పించాలి.

 శివ లింగానికి బిల్వ పత్రం సమర్పించేటప్పుడు ఆకు యొక్క పొడి భాగాన్ని పైకి ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ మన దగ్గర బిల్వ పత్రాలు లేకపోతే

 అక్కడ ఉన్న ఆకులను కడిగి మళ్ళీ శివలింగం పై సమర్పించవచ్చు. ఎందుకంటే బిల్వపత్రం ఎప్పటికీ పాతది కాదు.

  అలాగే ఎప్పుడైనా 11 లేదా 21 సంఖ్యలో బిల్వపత్ర లను శివుడికి సమర్పించటం మంచిది.

 ఒకవేళ బిల్వపత్రం అందుబాటులో లేకపోతే శివరాత్రి రోజున బిల్వ చెట్టు దర్శనం చేసుకొని చెట్టుని పూజించటం వల్ల కూడా పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుంది.

 అలాగే చెట్టు నుండి బిల్వపత్రాలను కోసే ముందు శివనామ స్మరణ చేస్తూ ఆకులను కోయాలి. ఇక శివ పూజలో ఆడవారు బిల్వపత్రం నైవేద్యంగాపెడితేఅఖండసౌభాగ్యంకలుగుతుంది.