సత్తా చాటిన “RRR”, “కాంతారా”.!

గత ఏడాది పాన్ ఇండియా సినిమా దగ్గర సెన్సేషన్ ని నమోదు చేసిన పలు చిత్రాల్లో మన టాలీవుడ్ నుంచి అలాగే కన్నడ నుంచి వచ్చిన చిత్రాలు చాలా ఉన్నాయి.

 మరి ఈ చిత్రాల్లో టాలీవుడ్ ప్రైడ్ ఆర్ ఆర్ ఆర్ మరియు కన్నడ నుంచి కేజీఎఫ్ మరియు కాంతారా లాంటి భారీ బాక్సాఫీస్ హిట్ లు అయితే ఉన్నాయి.

 మరి ఈ చిత్రాల్లో కాంతారా మరియు ఆర్ ఆర్ ఆర్ లు ఇండియాస్ ప్రిస్టేజియస్ అవార్డు దాదా సాహెబ్ పాల్కే లో మెరిసాయి.

  2023 కి గాను అరేంజ్ చేసిన ఈ అవార్డు వేడుకల్లో జక్కన్న  ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అనే జాబితాలో ఉత్తమ చిత్రంగా నిలవగా

 కాంతారా నుంచి అయితే ఉత్తమ నటుడు గా బెస్ట్ ప్రామిసింగ్ నటుడు గా హీరో అలాగే ఆ సినిమా దర్శకుడు రిషబ్ శెట్టి లు దక్కించుకున్నారు.

 దీనితో ఈ ఉత్తమ అవార్డులలో ఈ సినిమాలు మన నుంచి అయితే మెరిసాయి.

 కాగా ఈ లిస్ట్ లో మిగతా పాన్ ఇండియా భారీ హిట్ లు కేజీఎఫ్, కార్తికేయ 2 లాంటి  వాటికి ఏ కేటగిరీ లో కూడా చోటు దక్కకపోవడం అనేది ప్రశ్నార్థక అంశం గా మారింది.

 అలాగే ఓవరాల్ ఇండియా దగ్గర బెస్ట్ నటుడుగా బ్రహ్మాస్త్ర కి గాను రణబీర్ కపూర్ కి అవార్డు ఇవ్వడం కూడా ఆసక్తిగా మారింది.

 కాగా ఈ వేడుకల్లో సీనియర్ నటి రేఖ, హీరోయిన్ ఆలియా భట్, అనుపమ్ ఖేర్ తదితర బాలీవుడ్ నటులు పాల్గొన్నారు.