ఆస్కార్స్ లో ‘RRR’ హిట్ సాంగ్.!

 ఈ ఏడాది ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం అయినటువంటి ఆర్ ఆర్ ఆర్ కోసం తెలియని వారు ఉండరు.

 మొత్తం ప్రపంచం కూడా ఈ సినిమా విజయం అలాగే ఈ సినిమా ట్రాన్స్ లో ఇప్పుడు ఉన్నారు.

 దర్శకుడు రాజమౌళి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయిక లో వచ్చిన ఈ సెన్సేషనల్ హిట్ చిత్రం

 గ్లోబల్ వైడ్ కూడా మాసివ్ రీచ్ ని అందుకోవడంతో పర భాషా ఆడియెన్స్ లో అమితమైన క్రేజ్ ని ఈ చిత్రం తెచ్చుకుంది.

 దీనితో ఈ భారీ సినిమా విజయం ఎల్లలు దాటేసింది. ఇక దీనితో డెఫినెట్ గా ఈ సినిమాకి ప్రపంచ ప్రఖ్యాత అవార్డు ఆస్కార్ కూడా వస్తుంది అని చాలా మంది భావించారు.

 ఇక ఇండియా నుంచి సినిమా ఎంపిక అవుతుంది అనుకునే ఇండియా అకాడమీ వారు ఈ చిత్రాన్ని పంపకుండా షాకిచ్చారు.

 కానీ చిత్ర యూనిట్ మాత్రం తమ సినిమాని తామే అకాడమీకి పంపుకోగా అక్కడ నుంచి ఆసక్తి మొదలైంది. మరి పలు విభాగాల్లో అయితే ఈ చిత్రాన్ని మేకర్స్ పంపారు.

 మరి ఈ చిత్రం ఇప్పుడు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ లిస్ట్ లో “నాటు నాటు” పలు హాలీవుడ్ సినిమాలతో షార్ట్ లిస్ట్ అయ్యి అయ్యినట్టుగా అకాడమీ నుంచి అధికారిక అప్డేట్ వచ్చింది.

 దీనితో ఈ ప్రైడ్ మూమెంట్ తో ఇండియా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తుండగా చిత్ర యూనిట్ కూడా ఈ ఆనంద వాతావరణంలో మునిగి తేలుతున్నారు.

 మరి ఈ ప్రిస్టేజియస్ అవార్డు ఈ చిత్రాన్ని వరిస్తుందో లేదో అని చిత్ర యూనిట్ సహా ఆడియెన్స్ కూడా ఫింగర్స్ క్రాస్ చేసి చూస్తున్నారు.