జపాన్లో “RRR” 100 రోజుల ఊచకోత..పాత రోజులు అంటూ రాజమౌళి.!

ప్రస్తుతం టాలీవుడ్ లో మారిపోయిన ట్రెండ్ లో ఓ సినిమా హిట్ అయ్యింది అంటే అది ఎంత వసూళ్లు చేసింది అనేది ఆసక్తిగా మారింది

తప్ప ఒకప్పటిలా 50 రోజుల సెంటర్స్ ఎన్ని 100 రోజుల సెంటర్స్ ఎన్ని అనేవి అన్నీ పోయాయి కానీ సినిమా కోసం తెలిసిన ఆడియెన్స్ కి మాత్రం అవి ఎప్పటికీ ఓ తీపి గుర్తులే..

ఎప్పుడు నుంచో సినిమాని ఫాలో అయ్యేవారికి ముఖ్యంగా తెలుగు స్టేట్స్ ఆడియెన్స్ కి అయితే ఈ రికార్డులు సెంటర్స్ అనేవి తమ బ్లడ్ లో ఇమిడిపోయాయి.

అయితే ఇప్పుడు మన దగ్గర ఓ సినిమా 100 రోజులు ఆడడం అటుంచితే మనది కానీ దేశంలో అందులోని మన తెలుగు సినిమా 100 రోజులు ఆడితే ఎలా

ఉంటుందో ఆ కిక్ ని ఇప్పుడు దర్శకుడు రాజమౌళి ఎంజాయ్ చేస్తున్నాడు.

తన రీసెంట్ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) భారీ విజయాన్ని నమోదు చేసి ఇప్పుడు ఆస్కార్ వరకు కూడా వెళ్ళింది.

ఇక జపాన్ లో గత అక్టోబర్ నెలలో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఇప్పుడు 100 రోజుల సక్సెస్ ఫుల్ రన్ ని అక్కడ కంప్లీట్ చేసుకోగా అక్కడ 100 రోజుల రన్ ని ఏకంగా 114 సెంటర్స్ లో కంప్లీట్ చేసుకుంది.

మరి దీనిపై ఒకప్పుడు మన తెలుగు సినిమాలు ఇలా ఆడితే తెలుగు పేపర్ లో ఎలా స్టేట్మెంట్ తో పోస్టర్ లు ఇచ్చేవారో

అదే రీతిలో RRR సినిమా జపాన్ లో డైరెక్ట్ 42 కేంద్రాల్లో షిఫ్ట్స్ తో 112 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకున్న తొలి భారతీయ చిత్రం అంటూ రాజమౌళి ఎంతో ఆనందంగా కొత్త పోస్ట్ చేసాడు.

దీనితో మళ్ళీ తాను పాత రోజుల్లోకి వెళ్లానని అందుకు కారణమైన జపాన్ ఆడియెన్స్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని రాజమౌళి తెలిపారు.