‘డైమండ్ రాణి’ విమర్శలపై రోజా సెటైర్.!

‘నేను రాణినే.. కానీ, డైమండ్ రాణిని కాదు.. మా ఇంట్లో నన్ను రాణిలానే చూసుకున్నారు.. సినీ పరిశ్రమలోనూ సక్సెస్‌ఫుల్ కెరీర్ నాది. అక్కడా నేను రాణినే.

రాజకీయాల్లోనూ అంతే. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. మంత్రినయ్యాను.. నేను రాణినే..’ అంటూ సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి రోజా వ్యాఖ్యానించారు.

ఇటీవల జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ‘డైమండ్ రాణి’ అంటూ మంత్రి రోజాపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ‘నువ్వు కూడానా.?’

అంటూ అదో టైపులో సెటైర్ వేశారు మంత్రి రోజాపై జనసేన అధినేత. ఈ వ్యాఖ్యలపై రోజా తీవ్రంగా స్పందించారు.. నవ్వుతూనే కౌంటర్ ఎటాక్ చేశారు.

‘సినిమాల్లో నీ పనైపోయింది.. రాజకీయాల్లో నువ్వొక జోకర్‌వి..’ అంటూ పవన్ కళ్యాణ్‌పై మండిపడ్డారు రోజా. రోజా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మళ్ళీ ‘డైమండ్ రాణి’ అంటూ ట్రోలింగ్ జరుగుతోంది.

‘నువ్వు కూడా టీడీపీ నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయాయ్.. సినిమాల్లో పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ హీరో.. నువ్వేమో సినిమాల్లోనూ ఐరన్ లెగ్గువే..

రాజకీయాల్లోనూ అంతే..’ అంటూ జనసేన శ్రేణులు విమర్శలకు దిగుతున్నాయి.

మొత్తమ్మీద, ఈ వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. ముందు ముందు మరింత ముదిరి పాకాన పడేలా వుంది.