వరల్డ్ సినిమా దగ్గర తన సినిమాలతో తిరుగు లేని దర్శకునిగా పెరి తెచ్చుకున్న దర్శకుడు
ఎవరన్నా ఉన్నారు అంటే జేమ్స్ కామెరాన్ అనే చెప్పుకోవాలి.తాను చేసిన సినిమాలు ఓ దశాబ్ద కాలం పాటు టైం తీసుకున్నా
మళ్ళీ తన రికార్డులు మాత్రం మళ్ళీ ఎవరు బ్రేక్ చెయ్యని విధంగా ఉంటాయి.అలా తాను సెట్ చేసిన అవతార్ 1
రికార్డులు 2009 లో హాలీవుడ్ నెంబర్ 1 సినిమాగా నిలవగా ఇప్పుడు దాని దగ్గరకి అవతార్ 2 (అవతార్ ది వే ఆఫ్ వాటర్ చిత్రం) అయితే దూసుకెళ్తుంది.
ఆల్రెడీ వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర టాప్ 3 లోకి ఈ సినిమా చేరగా ఈ సినిమా అయితే ఇప్పుడు 2.22 బిలియన్ డాలర్స్ కొల్లగొట్టింది.
మరి ఇలాంటి సెన్సేషనల్ సినిమాలు తీసే బ్రిలియెంట్ మైండ్ దర్శకుడు కి ఎలాంటి రెమ్యూనరేషన్ ఉండాలి?
అందుకు తగ్గట్టు గానే జేమ్స్ కామెరాన్ ఇప్పుడు వరల్డ్ లోనే హైయెస్ట్ పైడ్ డైరెక్టర్ గా నిలిచాడని హాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి.
మరి జేమ్స్ కామెరాన్ అయితే అవతార్ 2 కోసం గాను ఏకంగా 96 మిలియన్ డాలర్స్ ని రెమ్యునరేషన్ గా తీసుకున్నారట.
అంటే మన దేశం కరెన్సీ లో చూస్తే ఏకంగా అది సుమారు 800 కోట్ల మొత్తం అట.
అసలు డైరెక్టర్ రెమ్యునరేషన్ నే మన దగ్గర ఓ సినిమా వసూళ్లు అంత ఉండడం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.
దీనితో ఇప్పుడు కెమరూన్ పారితోషకం సెన్సేషనల్ హాట్ టాపిక్ గా మారింది.