ఆ దర్శకుడి వలలో రామ్ చరణ్ పడతాడా.?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది.

రామ్ చరణ్ సరసన కైరా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

గతంలో రామ్ చరణ్ – కైరా అద్వానీ కలిసి ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించింది. ఈ చిత్రానికి దర్శకుడు బోయపాటి శ్రీను.

‘వినయ విధేయ రామ’ సినిమా ఫ్లాప్ అవడంతో, ఆ తర్వాత మళ్ళీ తెలుగు తెరపై కనిపించలేదు కైరా అద్వానీ. అంతకు ముందు ఆమె తెరంగేట్రం చేసింది మహేష్ సినిమా ‘భరత్ అనే నేను’.

ఇక, అసలు విషయమేంటంటే, రామ్ చరణ్‌తో సినిమా చేయడం కోసం మరో తమిళ దర్శకుడు సిద్ధమవుతున్నాడు. అతనెవరో కాదు, పవన్ కళ్యాణ్‌తో ‘ఖుషీ’ చిత్రాన్ని తెరకెక్కించిన ఎస్‌జె సూర్య.

అదే ఎస్‌జె సూర్య తెలుగులో ‘కొమరం పులి’, ‘నాని’ లాంటి ఆణిముత్యాల్నీ తెరకెక్కించాడు.

పవన్‌తో వున్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో రామ్‌చరణ్‌ని ఇటీవల దర్శకుడు సూర్య అప్రోచ్ అయ్యాడట.

ఇంకో రెండు మూడు మీటింగ్స్ తర్వాత చరణ్, ఎస్‌జె సూర్యతో సినిమాపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.

ఇంతకీ, ఎస్‌జె సూర్య మాయలో చరణ్ పడతాడా.? లేదా.? జస్ట్ వెయిట్ అండ్ వాచ్.