ఎట్టకేలకు విజయ్ దేవరకొండతో రిలేషన్ పై నోరు విప్పిన రష్మిక.. టూర్లు వెకేషన్ కి వెళ్ళామంటూ?

 గీత గోవిందం సినిమా ద్వారా బెస్ట్ కపుల్ గా అనిపించుకున్నటువంటి రష్మిక మందన్న విజయ్ దేవరకొండ తరచూ వార్తలో నిలుస్తూ ఉంటారు.

 ఈ సినిమాలో వీరిద్దరి క్యారెక్టర్లు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమా తర్వాత వీరిద్దరూ డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా నటించారు.

 దీంతో వీరిద్దరూ నిజజీవితంలో కూడా రిలేషన్ లో ఉన్నారంటూ తరచూ వార్తలను సృష్టిస్తూ ఉన్నారు.

 అయితే ఇప్పటికే ఈ వార్తలపై స్పందించిన రష్మిక ఎన్నోసార్లు తనది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమేనని చెప్పిన ఈ వార్తలు మాత్రం ఆగడం లేదు.

 రష్మిక విజయ్ ఇద్దరు కూడా మాల్దీవ్స్ కి వెళ్లి సెలబ్రేట్ చేసుకున్నారని ఈమె అభిమానులతో కలిసి లైవ్ సెషన్ లో పాల్గొనగా

 వెనక విజయ్ దేవరకొండ వాయిస్ వినిపించింది అంటూ మరోసారి వార్తలను సృష్టించారు.

 అయితే ఈ వార్తలపై స్పందించిన రష్మిక మనం ఏదైనా గట్టిగా సంకల్పిస్తే మనకు అదే వినపడుతూ ఉంటాయి

 అలాగే అందరికీ విజయ్ దేవరకొండ వాయిస్ వినిపించి ఉంటుందని నిజానికి ఆరోజు తనతో తన స్నేహితులందరూ కూడా పార్టీలో పాల్గొన్నారనీ ఈమె తెలిపారు.

 ఇక విజయ్ గురించి నా గురించి అలాంటి రూమర్స్ రావడానికి కారణం మేము నటించినా సినిమాలే కారణమని ఈమె తెలియజేశారు.

 అయితే తనకు విజయ్ మంచి ఫ్రెండ్ అని రష్మిక తెలిపారు. ఇక తాను ఎప్పుడు వెకేషన్ వెళ్లిన ఒంటరిగా వెళ్ళనని తనతో పాటు తన స్నేహితులు కూడా వెంట ఉంటారని ఈమె తెలియజేశారు.

 అయితే తాను విజయ్ తో కలిసి వెకేషన్ లకి, టూర్లకి వెళ్లలేదని చెప్పను కానీ మా ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్లామని అయితే మేము సెలబ్రిటీలు కనుక

మా పేర్లు తెరపైకి వచ్చాయి అంటూ ఈ సందర్భంగా విజయ్ తో రిలేషన్ గురించి రష్మిక చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.