తెలుగు సినీ పరిశ్రమలో హయ్యస్ట్ రెమ్యునరేషన్ ఏ హీరో తీసుకుంటున్నాడు.?
అంటే, ఠక్కున ప్రభాస్ పేరు చెబుతారు. అయితే, ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంత.? అంటే మాత్రం అటూ ఇటూగా 50 నుంచి 60 కోట్ల దాకా చెప్పడం మామూలే.
మహేష్ రేటు 80 కోట్లని ప్రచారం జరుగుతున్నా, అది నిజం కాదు. పవన్ కళ్యాణ్ మాత్రం 60 కోట్లు అందుకుంటున్నాడట
చిరంజీవి సైతం 40 కోట్లపైన రెమ్యునరేషన్ తీసుకుంటారన్నది ఓ వాదన. సరే, ఈ ప్రచారాలకీ, వాస్తవ వ్యవహారాలకీ చాలా తేడా వుంటుంది.
అల్లు అర్జున్ ‘పుష్ప’ కోసం వంద కోట్ల రెమ్యునరేషన్, ‘ఆర్ఆర్ఆర్’ కోసం చరణ్, ఎన్టీయార్ తొలిసారిగా వందేసి కోట్లు అందుకున్నారనే ప్రచారాలు.. ఇవన్నీ ఓ యెత్తు.
అయితే, రామ్ చరణ్ 100 కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటున్న తొలి తెలుగు హీరో.. అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అదీ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా కోసమట.
అది నిజమేనా.? నిజమే అయి వుండొచ్చు.. ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా స్థాయిలో చరణ్‌కి దక్కిన గుర్తింపు అలాంటిది మరి.!